కన్నడలో హిట్ అయిన “బాయ్స్ హాస్టల్” తెలుగులో కూడా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!!!

Ads

గత కొద్దికాలంగా ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే చాలు భాష ఏదైనా సినిమా సూపర్ హిట్ అవుతుంది . అందుకే ఒక భాషలో హిట్ అయితే తిరిగి దాన్ని వేరే భాషల్లో డబ్బులు చేసి ధైర్యంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కన్నడలో విడుదలైన హాస్టల్ హుడుగారు బేకగిద్దారే మూవీ మాంచి హిట్ కావడంతో తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఆ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

  • మూవీ : బాయ్స్ హాస్టల్
  • నటీనటులు : ప్రజ్వల్ బి.పి., మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స శ్యామ్, తేజస్ జయన్న, శ్రేయాస్ శర్మ.
  • నిర్మాత : ప్రజ్వల్ బి పి, వరుణ్ కుమార్ గౌడ, నితిన్ కృష్ణమూర్తి, అరవింద్ ఎస్ కశ్యప్
  • డైరక్టర్: నితిన్ కృష్ణమూర్తి
  • సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్
  • రిలీజ్ డేట్: ఆగస్ట్ 26, 2023

boys hostel review

స్టోరీ :

మూవీ అంతా తుంగ అనే ఒక బాయ్స్ హాస్టల్ నేపథ్యంలో సాగుతుంది. ఆ బాయ్స్ హాస్టల్లో ఉండే (ప్రజ్వల్) అజిత్ అనే ఒక కుర్రాడు ఎప్పటికైనా ఫిలిం మేకర్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అతనికి దగ్గర సినిమా తీయడానికి సరి అయిన కట్టలేదు అని ఫ్రెండ్స్ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. ఆ మిలిటరీ నుంచి వచ్చాను అని చెప్పుకునే ఆ హాస్టల్ వార్డెన్ ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందుకే అతనికి హాస్టల్ అబ్బాయిలకి పెద్దగా సరిపడేది కాదు. ఈ నేపథ్యంలో ఒకరోజు కొందరు హాస్టల్ అబ్బాయిల పేర్లు లెటర్లో రాసి ఆ వార్డెన్ సూసైడ్ చేసుకుంటాడు.

boys hostel review

ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు అని ఆనందించే లోపే తమ పేరు లెటర్ లో ఉంది అని తెలుసుకున్న కుర్రాళ్ళు కంగారు పడిపోతారు. ఎలాగైనా దీని నుంచి బయటపడాలి అని వార్డెన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని నిరూపించడానికి ట్రై చేస్తారు. అసలు ఏం జరిగింది ? వార్డెన్ ఎలా చనిపోయాడు? ఈ కుర్రాళ్ళు తాము చేయని నేరం నుంచి తప్పించుకో గలిగారా లేదా? ఇవన్నీ తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే…

Ads

రివ్యూ :

మొత్తం సినిమా ఒక నైట్ జరిగే ఇన్సిడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఈ నగరానికి ఏమైంది లాంటి ఫన్ అడ్వెంచర్ మూవీ టైప్ లోనే చిత్రం కూడా ఉంది. ఈ మూవీలో కామెడీ యాంగిల్ తో పాటు మంచి సస్పెన్స్ కూడా మెయింటైన్ చేశారు. కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ,కథనం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పేరుకే స్టోరీ ఒక నైట్ ఇన్సిడెంట్ హైలైట్ చేస్తుంది .. ఇందులో 500 మందికి పైగా నటులు ఉన్నారు.

boys hostel review

హాస్టల్లో చదువుకునే కుర్రాళ్ళు అనుకోకుండా ఎలా ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు అనే విషయాన్ని ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ ఇందులో కామెడీ తో పాటు హాస్టల్లో పిల్లల మధ్య ఎటువంటి వాతావరణం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా చూపించారు. మూవీకి వార్డెన్ పాత్ర మంచి హైలెట్గా నిలుస్తుంది. ఈ మూవీలో కామెడీ మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

  • వార్డెన్ పాత్ర ఈ మూవీకి టర్నింగ్ పాయింట్.
  • సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా సింపుల్ గా బాగా తెలిసిన స్టోరీ లాగా ఉంటుంది.
  • సిచువేషన్ కి తగ్గ డైలాగ్స్ ఉండడం తో ఎక్కడ సాగదీసినట్లు లేదు.

మైనస్ పాయింట్స్:

  • కొన్ని సీన్స్ రిపీట్ అవ్వడం తో బోర్ కొడుతుంది.
  • సెకండ్ హాఫ్ లో కొని సీన్స్ బాగా లాగింగ్ గా ఉంటాయి.

రేటింగ్ :

3 / 5

ట్యాగ్ లైన్ :

హాస్టల్ లో చదువుకున్నే విద్యార్థులు ఎదుర్కొనే పరిస్థితులను ఎంతో చక్కగా చూపించారు. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకునేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది.

watch trailer :

Previous articleచంద్రయాన్ 3 సక్సెస్ వెనకున్న ఇస్రో చైర్మన్ గురించి ఈ విషయాలు తెలుసా.? ఆయన నెల జీతం ఎంత అంటే.?
Next article“ఆసియా కప్” కి ముందు టీం ఇండియా సరి చేసుకోవాల్సిన విషయాలు ఇవేనా..?