చంద్రయాన్ 3 సక్సెస్ వెనకున్న ఇస్రో చైర్మన్ గురించి ఈ విషయాలు తెలుసా.? ఆయన నెల జీతం ఎంత అంటే.?

Ads

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఇస్రో అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. దీంతోపాటుగా ఇస్రో చైర్మన్ గురించి కూడా ఆన్లైన్లో ఎక్కువగా సెర్చ్ జరుగుతుంది.

ప్రజెంట్ ఇస్రో చైర్మన్ గా ఎస్ సోమనాథ్ వ్యవహరిస్తున్నారు. మరి సోమనాథ్ కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం..

2022 లో కె శివన్.. తర్వాత చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎస్ సోమనాథ్.లాంచ్ వెహికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ డిజైన్, స్ట్రక్చరల్ డైనమిక్స్, పైరోటెక్నిక్‌ల ఫీల్డ్స్ లో అతను కృషి చేయడమే కాకుండా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. వీటితో పాటుగా కమ్యూనికేషన్ ఉపగ్రహాల కోసం GSAT-MKII (F09), రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ కోసం GSAT-6A, PSLV-C41 లాంచ్ వెహికల్స్ ను డిజైన్ చేయడంలో కూడా ఆయన తన వంతు కృషి చేశారు.

Ads

1985లో సారాభాయ్ స్పేస్ సెంటర్,ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో చేరిన ఆయన తరువాత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్.. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్ తొలి దశలో పనిచేయడం జరిగింది. అలా క్రమంగా తన ప్రతిభను కనబరిస్తూ అంచలంచలుగా ఎదిగిన ఆయన ఈరోజు ఇస్రోకు చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకునే నెలసరి జీతం గురించి కూడా చాలామంది చర్చిస్తున్నారు. ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ అందుకుంటున్న బేసిక్ పే 2.5 లక్షలు, అయితే వీటితో పాటుగా మరికొన్ని అలవెన్స్ కూడా అందుతాయట.

Previous articleఅక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”
Next articleకన్నడలో హిట్ అయిన “బాయ్స్ హాస్టల్” తెలుగులో కూడా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!!!