Ads
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న మ్యాచ్ కు సమయం వచ్చేసింది. ఆసియాకప్-2023లో భాగంగా దాయాదుల పోరు సెప్టెంబర్ 2న (ఈ రోజున) మొదలైంది. అయితే ఈ మ్యాచ్ కి వరుణుడు పెద్ద షాక్ ఇచ్చాడు. వర్షం అంతరాయం కలిగించంతో మ్యాచ్ ప్రస్తుతం నిలిపివేశారు.
క్యాండీ లో జరుగుతున్న ఆసియాకప్ 2023లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం ఎలాంటి అంతరాయం కలిగిస్తుందో అనే ఆలోచనతోనే బాటింగ్ తీసుకున్నట్టు రోహిత్ తెలిపారు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
Ads
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే… పాకిస్తాన్ సూపర్ 4కు వెళ్తుంది. మరి భారత్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు 1-1 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు.
రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ జట్టుకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్‌లో నేపాల్ పై గెలిచి పాక్, ఇప్పటికే 2 పాయింట్లు దక్కించుకుని ఆసియా కప్ పాయింట్ల టేబుల్ టాప్ ప్లేస్ లో ఉంది. భారత్ తో మ్యాచ్ రద్దయితే, వచ్చిన పాయింట్ తో పాక్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది. దాంతో డైరెక్ట్ గా సూపర్ ఫోర్ రౌండ్‌కి క్వాలిఫై అవుతుంది. కానీ టీంఇండియాకి ఒక పాయింట్ వచ్చినా, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ భారీ రన్ రేట్‌తో విజయం సాధిస్తేనే సూపర్ ఫోర్ రౌండ్‌కి అవకాశం ఉంటుంది.