“ఖుషి” సినిమాలో “సమంత” రోల్ ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.?

Ads

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా రూపొందించిన సినిమా ఖుషి. వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో జంటగా కొంచెం సేపు కనిపిస్తారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

మంచి హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్న సమంతకు.. ఈ మూవీ సక్సెస్ ఎంతో ముఖ్యం. మొదటి రోజు అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకుంది.

kushi review

జాబ్ కారణంగా విప్లవ్ (విజయ్ దేవరకొండ) కాశ్మీర్ కి వెళ్తాడు. అక్కడ ఆరా బేగం (సమంత) ని కలుస్తాడు. తర్వాత తను ఆరా బేగం కాదు అని, తన పేరు ఆరాధ్య అని తెలుసుకుంటాడు. వారిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ వారి తండ్రులకి ఒకరికి ఒకరు అంటే పడదు అని వారికి తర్వాత తెలుస్తుంది. ఆరాధ్య తండ్రి ఆరాధ్య పెళ్ళికి ఒప్పుకోరు.

Ads

దాంతో ఆరాధ్య బయటికి వచ్చేసి విప్లవ్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వారి కుటుంబాల్లో వచ్చిన సమస్యలు ఏంటి? వీరిద్దరికీ మధ్య వచ్చిన సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

ఇది ఇలా ఉండగా…ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటగా సమంత ని అనుకోలేదు అంట. మరి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇంకెవరు విజయ్ దేవరకొండతో “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” లో జతకట్టిన “రష్మిక మందాన”. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దర్శకుడు శివ నిర్వాణ మొదటగా హీరోయిన్ గా రష్మిక ని అనుకున్నా…విజయ్, రష్మిక జోడీని గతంలో ఆడియన్స్ చూసేసారు.. కొత్త పెయిర్ ఉంటే బాగుండు అని…సమంత కి ఫిక్స్ అయ్యారు అంట. ఏది ఏమైనా సినిమాలో విజయ్ సమంత ల కెమిస్ట్రీ అయితే బాగానే వర్కౌట్ అయ్యింది.

Previous article“హైప్ తో పిచ్చెక్కించేలాగా ఉన్నారు..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!
Next articleASIA CUP : IND Vs PAK మ్యాచ్ రద్దు అయితే..? పాక్ నేరుగా సూపర్-4 కి..మరి టీమిండియా పరిస్థితి ఏమిటి..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.