Ads
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, పెళ్లి తరువాత విడాకులు తీసుకోవడం సహజంగా జరిగేవే. ప్రేమ దక్కకపోతే.. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన నటులు కూడా చాలా మందే ఉన్నారు. ప్రేమ మైకంలో పడి జీవితాన్ని కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వారిలో సులక్షణ పండిత్ కూడా ఒకరు. ఈమె ఇప్పటితరానికి తెలియకపోయినా.. 70-80sలో మాత్రం గొప్ప హీరోయిన్ గా కొనసాగారు.
ఈమె అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హ, జితేంద్ర, రాజేష్ ఖన్నా వంటి స్టార్స్ అందరి సరసన నటించారు. గాయనిగా చాలా పాటలు కూడా పాడారు. ఒకవైపు నటన, మరోవైపు తన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే.. ఆమె ఆ పాపులారిటీని పెంచుకోవడానికి ట్రై చెయ్యలేదు. కెరీర్ పై ఆమె ఎలాంటి ఫోకస్ పెట్టలేదు. దానికి కారణం ఆమె ప్రేమ. సంజీవ్ కుమార్ ను ఆమె ప్రేమించింది. ఆ ప్రేమ తప్ప ఆమెకి ఇంకేమీ కనబడలేదు. కానీ, సంజీవ్ అప్పటికే మరొక హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. ఆమె హేమ మాలిని అని అప్పట్లో రూమర్స్ అయితే ఉండేవి. ఉల్జాన్ సినిమాలో సులక్షణ, సంజీవ్ కుమార్ కలిసి నటించారు.
Ads
ఆ సమయంలోనే సులక్షణ అతనితో ప్రేమలో పడింది. మరో వైపు సంజీవ్ ప్రేమని కూడా ఆ హీరోయిన్ తిరస్కరించింది. దీనితో అతను డిప్రెషన్ లోకి వెళ్లి జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. దీనితో సులక్షణ పరిస్థితి బాధాకరంగా మారింది. అతనికి నచ్చ చెప్పి అతని జీవితంలోకి వెళ్లాలని అనుకుంది. కానీ అది సాధ్యం కాదని అర్ధం అయ్యాక అతడి గురించే ఆలోచిస్తూ జీవితం గడిపేసింది. సంజీవ్ కుమార్ 47 ఏళ్ల వయసులోనే గుండెపోటు వచ్చి మరణించారు. అతని మరణాన్ని తట్టుకోలేక సులక్షణ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. నాలుగు గోడల మధ్యే నలిగిపోయింది.
ఈ విషయాన్నీ ఆమె సోదరి విజేత పండిత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఆమె వద్దే సులక్షణ ఉంటోంది. ఓ రోజు బాత్ రూమ్ లో కాలు జారడంతో తుంటి ఎముక విరిగింది. అది బాగు చేసుకోవడానికి నాలుగు సర్జరీలు చేయించుకున్నా ఉపయోగం లేదు. ప్రస్తుతం ఆమె నడవలేని పరిస్థితి నెలకొంది. గుడ్డిగా ప్రేమించి.. ఆ ప్రేమ మైకంలో తన జీవితాన్నే నాశనం చేసుకున్న నిన్నటి తరం హీరోయిన్ రియల్ లైఫ్ స్టోరీ ఇది.