సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో కోట్లు కలెక్ట్ చేస్తుంది…ఈ సినిమా చూసారా.?

Ads

యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా సప్త సాగరదాచే ఎల్లో. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. హేమంత్ ఎం రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చరణ్ రాజ్ సంగీతాన్ని అందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ కన్నడ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. హీరో రక్షిత్ శెట్టి, పుష్కర మల్లీకార్జునయ్య ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, టీజర్లతో కన్నడలో ఈ సినిమాకి క్రేజ్ పెరగడంతో సినిమా రిలీజ్ స్క్రీన్స్ ని కూడా పెంచారు. కన్నడలో 4000 స్క్రీన్లలో సప్త సాగరదాచే ఎల్లో సినిమాను రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 5600 స్క్రీన్ల లో ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది.

Ads

ఈ సినిమాలో రక్షిత్ శెట్టి ఓ బిజినెస్ మాన్ కు కార్ డ్రైవర్ గా కనిపిస్తారు. హీరోయిన్ రుక్మిణి గాయనిగా కనిపిస్తారు. వీరిద్దరూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. తమ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే.. ఉన్నట్లుండి రక్షిత్ శెట్టి జైలు పాలవుతాడు. దీనితో అనుకోని పరిస్థితులు వస్తాయి. వారి మధ్య ఉన్న ప్రేమ గందరగోళంలో పడుతుంది. ఈ పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారు? ఎలా తమ ప్రేమని గెలిపించుకున్నారు అన్న అంశం చుట్టూ కథ నడుస్తుంది.

మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రక్షిత్ శెట్టి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాగా మిగిలిపోనుంది. కన్నడ రాష్ట్రంలో తొలి రోజే రెండు కోట్ల రూపాయలను వసూలు చేసిందీ సినిమా. మరో రెండు రోజుల్లో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 21 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

Previous articleఅతని ప్రేమలో పడిన హీరోయిన్.. అప్పుడు డిప్రెషన్ లో, ఇప్పుడు నడవలేక.. అసలు స్టోరీ ఏంటంటే?
Next articleవ్యోమగాములు అంతరిక్షంలో చనిపోతే… వారి శరీరాలను ఏమి చేస్తారు?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.