Ads
టీవీ అనేది చాలా మందికి సరదాగా చూసే ఓ కాలక్షేపం. కానీ, సీరియల్స్ వచ్చాక ఈ సరదాని కాస్తా సాగతీతగా మార్చాయి. అర్ధం పర్ధం లేని కాన్సెప్ట్స్ ను తీసుకొచ్చి కాలక్షేపానికి మొదలైన అలవాటుని కాపురాల్లో చిచ్చుపెట్టే గ్రహపాటుగా మార్చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఇలాంటి సీరియల్స్ కి చాలా మంది అలవాటు పడిపోవడం.
ఒకటే స్టోరీని ఎపిసోడ్ల కు ఎపిసోడ్లు తీస్తూ ఏళ్ల తరబడి సాగదీస్తూ ఉంటారు. అటు తీసేవాళ్లకు, ఇటు తీసేవాళ్లకు అసలు బోరు కొట్టదు. కానీ అటు ఇటు కాకుండా ఈ సీరియల్స్ అలవాటు లేని మనలాంటి వాళ్ళకి మాత్రం ఇది పెద్ద తలనొప్పి.
కొన్ని హిందీ సీరియల్స్ ను డైరెక్ట్ గా తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ లేని అలవాట్లు, ఇక్కడ లేని ఆచారాలు కూడా తెలుగు వాళ్ళు బలవంతంగా నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటె.. ఆల్రెడీ హిందీలో హిట్ అయిన సీరియల్స్ ను తెలుగు నేటివిటీకి రీమేక్ చేస్తుంటారు. ఇక వీటి సంగతి చెప్పక్కర్లేదు. ఏళ్ల తరబడి సాగుతూ ఉంటాయి. తీసేవాళ్ళ ఓపిక, చూసే వాళ్ళ తీరిక అన్నట్లు ఉంటాయి ఇవి.
తాజాగా.. ఓ జంట ఈ సీరియల్స్ తీరుపై ఓ రీల్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో తమ అకౌంట్ లో ఈ రీల్ ను వారు పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. తెలుగు సీరియల్స్ లో కనిపించే పెళ్లి కాన్సెప్ట్ ని ఈ వీడియోలో చాలా ఫన్నీగా చూపించారు. నిజంగా సీరియల్స్ లో ఇలానే చూపిస్తున్నారో లేదో కానీ.. ఈ వీడియో మాత్రం నెటిజన్స్ లో నవ్వులు పూయిస్తోంది. ఈ సరదా వీడియో ను మీరు కూడా ఇక్కడే చూసేయండి మరి.
Watch Video: