ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారా..? ముందు రోజు రాత్రే..?

Ads

రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ పై మొదటి రెండు ఎపిసోడ్ల తర్వాత ప్రేక్షకులకు కాస్త అసంతృప్తి కలిగింది. రైతు బిడ్డ అన్న సెంటిమెంట్ డైలాగ్ చెప్పడం తప్ప అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి చేసింది ఏమీ లేదు..

రతిక తో పులిహార కలపడం.. కింద పడ్డ మెతుకులు ఏరుకు తినడం…కెమెరాలతో మాట్లాడడం.. ఇలా సింపతి కోసం తన వీడియోల తెలివితేటలన్నీ వాడేసాడు.

అయితే నిన్న మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్ ప్రవర్తనపై అమర్‌దీప్ విరుచుకుపడడం ప్రస్తుతం ప్రశాంత్ కు కాస్త సానుభూతిని తెచ్చిపెడుతోంది. నిజానికి ఓటింగ్ ప్రక్రియలో భాగంగా.. అమరదీప్ ప్రశాంత్ పై విమర్శలు కురిపించలేదు అనే విషయం .. ఆట సందీప్, అమరదీప్ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన మొదటి రోజు జరిగిన కాన్వర్జేషన్ ని బట్టి సులభంగా అర్థమవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

bigg boss telugu 7 nominations prashanth amardeep issue

Ads

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన మొదటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో అమర్‌దీప్, ఆట సందీప్, రతిక, పల్లవి ప్రశాంత్ మాత్రం మేల్కొని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్ పై అమరదీప్ ఇచ్చిన స్టేట్మెంట్ అతని ఇంటెన్షన్స్ మొదటి రోజు నుంచే ఏమిటా అన్న విషయంపై స్పష్టతనిస్తున్నాయి.

bigg boss telugu 7 nominations prashanth amardeep issue

వివరాల్లోకి వెళ్తే మాట్లాడుతూ కూర్చున్న సమయంలో, “ఈ ప్రశాంత్ ని గమనిస్తే…ప్రళయం వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉన్నాడు అనిపిస్తుంది.. మనోడికి ఫోకస్ కాస్త ఎక్కువే” అని సందీప్ అన్నాడు. దానికి అక్కడే ఉన్న అమర్‌దీప్.. “నువ్వు మామూలోడివి కాదు ..నాకు డౌటే ..ఏదో తేడా కొడుతోంది..” అని అన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం వీరి మాటలకు నవ్వి అలాంటిదేం లేదు అని సమాధానం ఇచ్చాడు. చాలామంది ప్రస్తుతం ఈ వీడియోని పోస్ట్ చేసి ప్రశాంత్ పై అమర్‌దీప్ మొదటి నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు అని అంటున్నారు

Previous articleమన తెలుగు సీరియల్స్ ఇలాగే ఉంటాయా? ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Next articleగుండె దడ సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయి..? ఇలా అయినప్పుడు మొదటిగా ఏం చేయాలి..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.