Ads
ఇండియా వ్యాపార దిగ్గజం రతన టాటా…ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. వ్యాపార రంగంలోకి రాణించాలి అనుకునే ఎందరికో రతన్ టాటా స్ఫూర్తిదాయకం. అందరూ రతన్ టాటా ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు అని ఆలోచిస్తారే తప్ప ఆ స్థానానికి చేరుకోవడానికి ఆయన ఎంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు అన్న విషయాన్ని గమనించరు.
1999 లో టాటా కంపెనీ మొదలుపెట్టిన కార్ల వ్యాపారం పెద్దగా సాగలేదు…ఇక ఈ బిజినెస్‌ను అమ్మేద్దాం అనే ఒపీనియన్ కి వచ్చి ఫోర్డ్ కంపెనీని అప్రోచ్ అవడం జరిగింది. ముంబైలో ఉన్నటువంటి టాటా కంపెనీ హెడ్ క్వార్టర్స్ ను చూసిన తర్వాత బిజినెస్ కొనడం గురించి వారు ఆసక్తి కనబరిచారు. అయితే ఇక కంపెనీ అమ్మడం కోసం టాటా తన టీం తో డెత్రాయిట్ కు వెళ్ళినప్పుడు వాళ్ల నుంచి స్పందన రాలేదు.
Ads
నాలుగు గంటల పాటు సాగిన మీటింగ్‌లో వాళ్ళ ప్రవర్తన కాస్త అవమానపరిచినట్లు ఉందంట. అసలు మీకు తెలియనప్పుడు ప్యాసింజర్ కార్ డివిజన్ ఎందుకు స్టార్ట్ చేశారు అని వాళ్ళు అడిగిన ప్రశ్న టాటా ను చాలా ఇబ్బంది పెట్టిందట. వాళ్లు మాట్లాడే తీరు మీ డివిజన్ కొనుక్కొని మేమేదో ఫేవర్ చేస్తున్నాము అన్నట్లు ఉందట. మీటింగ్ తర్వాత అందరూ కలిసి న్యూయార్క్ బయలుదేరిన సమయంలో ఫ్లైట్‌లో గడిచిన 90 నిమిషాలు రతన్ టాటా చాలా డల్ గా ఉన్నారట.
అయితే ఎవరు ఊహించని విధంగా 2008లో టాటా మోటార్ సంస్థ ఆర్థిక మాంద్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఫోర్డ్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్స్ ని 2.3 బిలియన్ల కి కొన్నారు.జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుక్కొని తమకు ఎంతో మేలు చేశారని ఫోర్టు చైర్మన్ బిల్ ఫోర్డ్ స్వయంగా రతన్ టాటా కు థాంక్స్ చెప్పడం జరిగింది. ఇలా టాటా తన స్వీట్ రివేంజ్ గుర్తుపెట్టుకో మరి తీసుకున్నాను.