ఈ శుక్రవారం “వరలక్ష్మి వ్రతం” చేస్తున్నారా.? అయితే తోరం కట్టుకోవడం లో ఈ తప్పు అస్సలు చేయకండి.!

Ads

శ్రావణ మాసం అనగానే ముందు గుర్తొచ్చే స్త్రీలు పాటించే నోములు, పూజలే. మహాలక్ష్మి దేవి కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం లో వారు తమ సౌభాగ్యం కోసం నోములు, వ్రతాలూ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ మాసం శివుడికి, నారాయణుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసమట. చాంద్రమానం ప్రకారం వచ్చే ఐదవ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుచుకుంటాం.

మహిళలు ఎక్కువ గా ఆచరించే వ్రతాలలో మంగళ గౌరీ వ్రతం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కొత్త గా పెళ్లి అయిన ముత్తైదువులు ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. నెలలో అన్ని మంగళవారాలు ఈ నోమును చేయడం తో పాటు.. శ్రావణ మాసం లో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. శ్రావణ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేస్తారు.

ఈ వ్రతం చేసే వారికి తోరపూజ గురించి తెలిసే ఉంటుంది. అమ్మ వారిని షోడశోపచారాలతో పూజించిన తరువాత.. వ్రత కథ ను చదివేముందు ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజిస్తారు. అయితే.. ఈ తోరాల విషయం లో చాలా మంది తెలియక తప్పులు చేస్తుంటారు. పొరపాట్లను అమ్మవారు మన్నించినా.. మనం పదే పదే అవే పొరపాట్లను చేయకూడదు కదా..

Ads

చాలా మంది సమయం కలిసి వస్తుంది అని ముందు రోజే వీటిని తయారు చేద్దాం అనుకుంటారు. ఇలా చేయాలనుకునే వారు శుభ్రం గా స్నానం చేసి ఉదయాన్నే భోజనం తినకుండా.. పూజా సమయం లోనే చేసి పెట్టుకోండి. సాయం సమయానికి మనం తినేసి ఉంటాము.. లేదా ఇంకా ఎక్కడైనా బయట తిరిగి ఉంటాము. తోరాలను తయారు చేసే ముందు శుభ్రత, శ్రద్ధ చాలా అవసరం. ఇక కొందరైతే.. తమ ఇంట్లో ఎంత మంది ఉంటారో..వారికి సరిపోయే అన్ని తోరాలనే చేసుకుంటారు. ఇది కూడా సరికాదు.

మంగళ గౌరీ నోములకు.. కుటుంబ ఆచారాన్ని అనుసరించి ఐదు చేసుకున్నప్పటికీ.. వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఎవ్వరైనా తొమ్మిది తోరాలను.. తొమ్మిది ముడులు వేసి తయారు చేయాల్సిందే. ఈ తోరాలకు ఉత్తిగా ముడులు వేయడం కాకుండా పూవులను పెట్టి ముడులు వేయాలి. ఆ తరువాత కథ చదివే ముందు మాత్రమే ఈ తోరాన్ని పూజించి కుడిచేతికి ధరించాలి. కొంత మంది మరిచి పోయి పూజ అయిపోయాక కట్టుకోవడం లాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి హడావుడి పడకుండా.. భక్తి తో పూజ చేసుకుని పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి.

Previous articleచంద్రయాన్-3 సక్సెస్ తో ఆదిపురుష్ పై ట్రోల్స్… కారణం ఇదే.!
Next article“గాండీవధారి అర్జున”తో “వరుణ్ తేజ్” హిట్ కొట్టగలిగారా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్..!!!