Ads
సినిమా హాల్స్ కి వెళ్లి సినిమా చూసే సమయం ఎప్పుడో పోయింది ఇప్పుడు అంతా ఓటీటీలో కాలం నడుస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో రావాల్సిందే. మరీ చిన్న చిన్న సినిమాలు అయితే వారం గడిచే లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.
ఇలాంటి అప్డేట్స్ ఉన్న టైంలో కూడా కొన్ని సినిమాలు అసలు ఓటీటీలో అడ్రస్ లేకుండా పోయాయి. రిలీజ్ అయ్యి నెలలు దాటిపోతున్నా, సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా, ఇంకా అవి ఎందుకు స్ట్రీమింగ్ కావడం లేదు ఎవరికీ తెలియదు. మరి ఆ మూవీస్ ఏంటి వాటి వెనక స్టోరీ ఏంటి చూద్దాం పదండి..
ఏజెంట్
అక్కినేని హీరో అఖిల్ ని పెట్టి ఎంతో ధైర్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఏజెన్ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ గా మిగిలిందో అందరికీ తెలుసు. అయినా సరే ఈద్ చిత్రం ఇప్పటివరకు ఓటీటీలో ఎక్కడా కనిపించలేదు. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సోనీ లివ్ మే 19వ తారీఖున ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ఉసే లేదు. వేసినా ఎవరూ చూడరనుకున్నారో ఏమో వెయ్యకుండా ఆపేసారు.
Ads
ది కేరళ స్టోరీ
అదా శర్మ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మోస్ట్ కాంట్రవర్షల్ ఫిలిం ది కేరళ స్టోరీ.. 300 కోట్లకు పైగా వసూలు రాబట్టి భారీ సక్సెస్ సాధించింది. అయితే చిత్రం రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా ఓటీటీల మాత్రం స్ట్రీమింగ్ కాలేదు.
రామబాణం
భారీ అంచనాల మధ్య విడుదలై మిస్సైల్ అయిన రామబాణం ఇంతవరకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫారం లో కూడా స్ట్రీమింగ్ కాలేదు.మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా మిగిలింది.
హట్కే జర బచ్కే
ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే తుజే చాంద్ కే అంటూ…ఈ మూవీలో సాంగ్ మాత్రం పాపులర్ అయింది కానీ విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఇది ఓటీటీలో రిలీజ్ కాకపోవడం అభిమానులకు నిరాశను మిగిల్చింది.