“పెళ్లి చూపులు” నుండి “లైగర్” వరకు… “విజయ్ దేవరకొండ” సినిమాల కలెక్షన్స్ వివరాలు.!

Ads

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ఆర్డర్ లో ఉన్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కుర్ర హీరో‘’అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ లాంటి చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో ఒకటి రెండు మంచి హిట్లు పడినప్పటికీ ఆ తరువాత వరుస ప్లాపులతో తెగ సతమతం అవుతున్నాడు ఈ హీరో. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. మరి ఈ హీరో నటించిన పది సినిమాల బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూద్దామా..

పెళ్ళి చూపులు :

విజయ్ దేవరకొండ హీరోగా డెబ్యూ మూవీ పెళ్లిచూపులు మూవీ రూ.14.16 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది.

ద్వారక :
శ్రీనివాస్ రవీంద్ర డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.1.87 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది ఈ సినిమా.

అర్జున్ రెడ్డి :

విజయ్ దేవరకొండ కెరియర్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి తిరిగిన శ్రీ చిత్రం 25 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఏ మంత్రం వేసావే :

Ads

విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత డిజాస్టర్ మూవీ ఇదే. రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో ఏకంగా రూ.0.40 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది ఈ సినిమా.

గీత గోవిందం :

రౌడీ బాయ్ ను ఫ్యామిలీ మాన్ గా చూపించిన గీత గోవిందం రూ.55 కోట్ల లాభాలు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

నోటా :

మొదటిసారిగా విజయ్ దేవరకొండ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో నటించిన నోటా మూవీ 13 కోట్ల నష్టాలను మిగిల్చింది.

టాక్సీ వాలా :

ఈ హార్రర్ కామెడీ మూవీ 14 కోట్ల లాభాలు తెచ్చి పెట్టింది.

డియర్ కామ్రేడ్ :

భారీ అంచనాల మధ్య విడుదలై 13 కోట్ల నష్టాలు తెచ్చిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
.
వరల్డ్ ఫేమస్ లవర్ :

వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ 20 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

లైగర్ :

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హై యాక్షన్ డ్రామా లైగర్ .57.36 కోట్ల నష్టాలను మిగల్చడమే కాకుండా విజయ్ దేవరకొండ కెరియర్ లో ట్రిపుల్ డిజాస్టర్ గా గుర్తింపు పొందింది.

Previous articleపెళ్లి అయ్యాక కూతురి విషయంలో ఏ తల్లీ ఈ 5 తప్పులు చెయ్యకూడదు…అవేంటంటే.?
Next article“ఘర్షణ” లో “ఆసిన్” లాగే…టీచర్లుగా నటించిన 13 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.