Ads
శ్రావణమాసం వచ్చిందంటేనే పెళ్లిళ్ల సీజన్ మొదలైందని అర్థం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక ఇంట్లో పెళ్లి హడావిడి ఫుల్లుగా కనిపిస్తుంది. పెళ్లి అంటే పెళ్లి పత్రిక ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మామూలుగా పెళ్లి పత్రికలో పెళ్లి కొడుకు పేరు, పెళ్లికూతురు పేరు, పెళ్లి జరిగే తారీకు ముహూర్తం కళ్యాణ మండపం అడ్రస్.. ఇలాంటివి సాధారణంగా అచ్చు వేస్తారు.
అయితే ప్రస్తుతం ఒక పెళ్లి పత్రిక మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పెళ్లి వెన్యూ లేకపోతే ఇంకేదో కారణం వల్ల కాదు మెయిన్ గా పెళ్లి కూతురు పేరు వల్ల ప్రస్తుతం ఆ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అసలు ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు…. ఇది పేరైనా.. రాయాలంటే ఒక పనిలో ఇంక కూడా అయిపోయేలా ఉంది అంటూ జనాలు ఆ పత్రికకు తెగ కామెంట్లు పెడుతున్నారు.
Ads
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ పెళ్లికూతురు పేరు ఏదో రెండు అక్షరాలు పది అక్షరాల్లో కాక ఏకంగా ఒక అర పేజీ ఉంది.ల.సౌ. వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవీ లలితా పార్వతి రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష….. ఇది అమ్మాయి పూర్తి పేరు. ఇది చూసిన వాళ్లకి ఎవరికైనా చిన్నతనంలో నేర్చుకున్న అ ఆ లు వరుసగా గుర్తుకొస్తాయేమో. ఈ పెళ్లి కార్డు చూసిన నేటిజన్స్ కార్డులో సగం పేజీ పైనే ఉన్న అమ్మాయి పేరు చూసి…పేర్ల పుస్తకంలో ఒక పేరు చూసి పెట్టకుండా పుస్తకంలో ఉన్న పేర్లు మొత్తం పెట్టినట్టు ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటుగా రేపు పెళ్లి తర్వాత ఇంతకీ అబ్బాయి అమ్మాయిని ఏ పేరు పెట్టి పిలుస్తాడో అని కూడా డౌట్ పడే వాళ్ళు ఉన్నారు.