బిగ్ బాస్ 6 ఫెయిల్ అయినందుకేనా బిగ్ బాస్ 7 లో ఇలా చేసారు.? ఏకంగా మొదటి నామినేషన్ లోనే.?

Ads

ఏడు సంవత్సరాల నుంచి ఏ మాత్రం వన్నె తగ్గకుండా ఇప్పటికీ బుల్లితెరపై తిరుగులేని రియాలిటీ షో గా కొనసాగుతోంది బిగ్ బాస్. ఎంటర్టైన్మెంట్ హద్దులు చెరిపిస్తూ.. భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ అందుకున్న ఈ షోకి టీఆర్పీ రేటింగ్ కూడా నేషనల్ లెవెల్ లో ఉంటుంది మరి. ఆరు రెగ్యులర్ సీజన్స్ తో పాటు ఒక ఓటీటీ వెర్షన్ సీజన్ పూర్తి చేసిన ఈ షో నా ఆదివారం నాడు సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది.

bigg boss telugu 7 contestant rathika

ఇదే నేపథ్యంలో మొదటివారం జరగబోతున్న ఓటింగ్ ప్రక్రియలో ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారో అన్నదానిపై కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీజన్ 6 వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈసారి భారీగానే ప్రయత్నిస్తోంది బిగ్ బాస్ టీమ్. అందుకే ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ తో కంటెస్టెంట్స్ కి మొదటి రోజు నుంచే పలు రకాల టాక్స్ , జలక్స్ ఇస్తోంది.

Ads

బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ మామూలుగా సోమవారం రాత్రి మాత్రమే ప్రసారమవుతుంది. అయితే ఈసారి ఈ సీజన్ 7 లో మాత్రం రెండు రోజులపాటు అంటే సోమ మంగళవారాల్లో కూడా కొనసాగుతుంది. ఈ సీజన్లో మొదటి వారానికి సంబంధించిన నామినేషన్స్ నేరుగా కాకుండా వేరువేరు గదులలో జరుగుతుంది. మొదటి వారమే ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామిని మొదటి వారం నామినేట్ అయిన లిస్టులో ఉన్నారు.

ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ కూడా ఎంతో హుషారుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. హౌస్ మేట్స్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో టాప్ లో ఉండగా అతని తరువాత స్థానంలో కార్తీక దీపం బ్యూటిఫుల్ విలన్ శోభా శెట్టి ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. మొదటి నామినేషన్ కి హౌస్ మేట్స్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉంది…ఇక ముందు ముందు ఎటువంటి ట్విస్టులు వస్తాయో…చూడాలి

Previous articleఇదేందయ్యా …ఇంత పెద్ద పేరు నేను ఎక్కడా చూడలే…
Next articleఅచ్చం వై.ఎస్.భారతి లా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.