Ads
కృష్ణుడిని హిందువులు పూజిస్తూ ఉంటారు. కృష్ణాష్టమి వంటి వాటిని కూడా చాలా అందంగా అంగరంగ వైభవంగా జరుపుతారు. కృష్ణాష్టమి నాడు చిన్న పిల్లలకి కృష్ణుడి వేషం వేయించడం.. ఆలయాల్లో కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం.. పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే ఉత్సవాలు జరపడం ఇలా ఎన్నో విధాలుగా కృష్ణుడిని మనం పూజిస్తూ ఉంటాము. గుర్తు చేసుకుంటూ ఉంటాము. అయితే కృష్ణుడికి సంబంధించి మనం ఎన్నో విషయాలని వింటూ ఉంటాము.
దశావతారంలో ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడికి పురాణాల ప్రకారం 16,108 మంది భార్యలు ఉన్నారని చెబుతూ ఉంటారు. మరి నిజంగా ఇంత మంది భార్యలు శ్రీకృష్ణుడికి ఉన్నారా..?
Ads
అంతమందిని కృష్ణుడు వివాహం చేసుకున్నారా..? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దశావతారాల్లో ఒక అవతారమైన వరాహమూర్తి మరియు భూదేవికి జన్మించిన వారు నరకాసురుడు. నిజానికి నరకాసురుడు ఎంతో మందిని బాధ పెట్టాడు. ఎన్నో పాపాలు చేశాడు. పాప భారం బాగా పెరిగిపోవడం వలన అతడిని శిక్షించాలని శ్రీ మహా విష్ణువు అనుకున్నారు. కానీ భూదేవి మాత్రం తన బిడ్డను ఏమీ చేయొద్దని చెప్పింది. తను చేసే పాపాలన్నీ కూడా తానే భరిస్తానని మహావిష్ణువుకి చెప్పింది భూదేవి. శ్రీమహావిష్ణువు అందుకు అంగీకరించి నరకాసురుడు తన తల్లి భూదేవి చేతుల మీద తప్ప ఇంక ఎవరి చేతిలో కూడా మరణించలేడని.. తన తల్లి తప్ప ఇక ఎవరూ చంపడం కుదరదని వరం కోరేలా చేయడం జరిగింది.
శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు సత్యభామని తీసుకువెళతాడు. అప్పుడు నరకాసురుడు బాణం వేస్తాడు. దానికి మూర్చ పోయినట్లు నటిస్తాడు కృష్ణుడు. సత్యభామ నరకాసురుడిని చంపేలా మాయ చేస్తాడు కృష్ణుడు. అయితే నరకాసురుడు కామాంధుడు. 16,108 మంది స్త్రీలని బందీలుగా చేసి హింసిస్తూ ఉండేవాడు. నరకాసురుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి విముక్తి కలుగుతుంది. అయితే వాళ్లని ఏలుకోవడానికి ఒప్పుకోలేదు ఎవరూ కూడా. ఈ మూలంగా కృష్ణుడు వాళ్ళందరిని భార్యలుగా స్వీకరించి రాణుల హోదాని కలిపిస్తారు శ్రీకృష్ణ భగవానుడు.