“షారుఖ్ ఖాన్” ని తిట్టేముందు ఈ పాత వీడియో చూశారా..? అసలు అలా అనడానికి కారణం ఏంటంటే..?

Ads

నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్, షారుఖ్ ఖాన్ ఇటీవల జరిగిన అంబానీ వేడుకల్లో రామ్ చరణ్ ని, “ఇడ్లీ, వడ, సాంబార్” అని పిలిచినట్టు, అది కరెక్ట్ కాదు అన్నట్టు ఒక పోస్ట్ షేర్ చేశారు.

దాంతో సోషల్ మీడియా అంతటా కూడా షారుఖ్ ఖాన్ ని తిట్టడం మొదలు పెట్టారు. బాలీవుడ్ వాళ్లకి మన సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే కుళ్ళు అని, అందుకే అలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.

ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అయితే, ఏదైనా సౌత్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు తన సినిమా రిలీజ్ చేస్తారు అని, కానీ అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ అసూయతోనే ఇలా మాట్లాడుతారు అని అంటున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాల క్రితం వన్ టూ కా ఫోర్ అనే సినిమా చేశారు. అందులో షారుఖ్ ఖాన్ ఒక సీన్ లో తాను సౌత్ ప్రాంతంలో పోలీస్ గా పని చేసి వచ్చాను అని, తనకి కాస్త తమిళ్ వస్తుంది అని మాట్లాడుతూ, “ఇడ్లీ, వడ, సాంబార్, రజినీకాంత్” అని అంటారు. ఇదే సినిమా రిఫరెన్స్ ని ఇక్కడ వాడారు. కానీ రజనీకాంత్ ప్లేస్ లో రామ్ చరణ్ అని అన్నారు.

Ads

తన సినిమా డైలాగ్ గురించి తనే చెప్పుకున్నారు. అంతే కానీ రామ్ చరణ్ ని ట్రోల్ చేయలేదు. అసలు నిజానికి షారుఖ్ ఖాన్ కి, మెగా ఫ్యామిలీకి చాలా మంచి స్నేహం ఉంది. గతంలో ఒక సమయంలో రామ్ చరణ్ కి షారుఖ్ ఖాన్ ట్వీట్ కూడా చేశారు. అందులో, “మై మెగా పవర్ స్టార్” అని రామ్ చరణ్ ని సంబోధించారు. అయితే, ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా ఆ స్నేహంతో మాత్రమే అలా అన్నారు కానీ, వేరే ఉద్దేశం ఏం లేదు అని అంటున్నారు. “తన సినిమా పాత డైలాగ్ ని ఇప్పుడు వాడారు. అంతకుముందు రజనీకాంత్ పేరు చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ పేరు చెప్పారు” అని అంటున్నారు.

watch video :

ALSO READ : రాముని పాత్రలో నటించిన 12 మంది తెలుగు హీరోలు వీరే…ఎవరు ఏ సినిమాలో అంటే.?

Previous articleకీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే కదా..? మరి పేర్ల ముందు అక్షరాలు ఎందుకు వేరేగా ఉంటాయి..?
Next articleశ్రీకృష్ణుడు కి 16వేల మంది భార్యలు ఎందుకు ఉండేవారు..? మీకు తెలుసా..?