Ads
మోడి ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చబోతోందని కొన్ని రోజులుగా విపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జీ20 సదస్సు ఆహ్వాన పత్రికలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పెట్టడంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇండియా పేరు భారత్ గా మార్చడం పై కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది కేంద్ర ప్రభుత్వ డిసిషన్ ను సమర్థిస్తుంటే, కొందరు తప్పుబడుతున్నారు. ఇక రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే రాజ్యంగ ముసాయిదాలోనే లేని భారత్ అనే పదం.. ఆ తర్వాత ఎలా వచ్చింది? ఇప్పుడు చూద్దాం..
జీ20 ఆహ్వాన పత్రికలో ఉపయోగించిన “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అనే పదం రేపిన వివాదం మామాలుగా లేదు. రాజకీయ పరంగా, సోషల్ మీడియాలో మరియు ప్రజల్లోనూ ఈ టాపిక్ చర్చకు దారితీసింది. రాజ్యాంగం కూడా ఇండియా అంటే భారత్ అని చెబుతున్నా, చాలా మంది ఎందుకిలా ఇండియా అనే పేరును వద్దని అంటున్నారు అనే చర్చ తెరపైకి వచ్చింది.
Ads
బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందిన తరువాత రాష్ట్ర అసెంబ్లీలు కలిసి భారత రాజ్యాంగ సభగా మారాయి. ఈ సభలో జరిగిన చర్చల ఆధారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రూపొందించారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన మొదటి ముసాయిదాను1948లో నవంబర్ 4న రాజ్యాంగ సభకు సమర్పించారు. అయితే ఇందులో దేశం పేరును తెలిపే ఆర్టికల్ 1లో ‘భారత్’ అనే పదం లేదు. అందులో “ఇండియా రాష్ట్రాల యూనియన్” అని పేర్కొన్నారు.
సంవత్సరం తర్వాత 1949 లో సెప్టెంబర్ 17న అంబేద్కర్ మరి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. వాటిలో ఒకదాని ప్రకారం “ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్” అని ప్రతిపాదించారు. అయితే ఆ తరువాతి రోజు సెప్టెంబర్ 18న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హెచ్.వి. కామత్ భారత్ పేరును ప్రస్తావిస్తూ తీర్మానం తీసుకువచ్చారు. దాని పై ఓటింగ్ నిర్వహించగా కామత్ తీర్మానానికి అనుకూలంగా 38, వ్యతిరేకంగా 51 ఓట్లు రావడంతో అది వీగిపోయింది. దాంతో ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్ అని ఖరారైంది.