Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ సీజన్ 7 హవా నడుస్తోంది. ఉల్టా పుల్టా అంటూ ఎంతో హంగామాగా మొదలుపెట్టిన ఈ షో నిజంగానే కంటెస్టెంట్స్ నే కాక ప్రేక్షకులను కూడా తికమక పెడుతూ ముందుకు సాగుతోంది.
క్రితం సారి జరిగిన వైఫల్యం కారణంగా బిగ్ బాస్ అంటే అప్పటి వరకు ఉన్న క్రేజ్ బాగా పడిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా తిరిగి క్రేజ్ సంపాదించాలి అని వినూత్నమైన కాన్సెప్ట్స్ తో.. షో ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు.
ఈ షో స్టార్టింగ్ హౌస్ లోకి సెలక్ట్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ స్టైల్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అందరిలోకి బాగా గుర్తుండిపోయేలా స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం రతిక రోజ్…రావడంతోటే స్టేజీపై నాగార్జునతోటే పులిహోర కలిపిన ఈ పాప హౌస్ లోకి ఎంటర్ అయ్యాక కూడా బాగా హల్చల్ చేస్తోంది. మరోపక్క కామన్ మాన్ కేటగిరీలో ఇంట్లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో కూడా పులిహోర కలపడం మొదలుపెట్టింది.
Ads
మొన్న జరిగిన ఎపిసోడ్ లో నీ మనసు ఎవరికీ ఇస్తావంటే నేరుగా నీకే ఇస్తానని ప్రశాంతికి రేంజ్ షాక్ ఇచ్చింది రతిక.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రతిక మరో విషయానికి బాగా వైరల్ అయింది. బిగ్ బాస్ షో స్టార్టింగ్ లో నాగార్జున విన్నర్ ఎవరో హింట్ ఇచ్చారు అంటూ వస్తున్న వార్తకి.. రతిక కు మధ్య ఏంటి సంబంధం అనుకుంటున్నారా ?అక్కడికే వస్తున్నా..
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరికంటే పోల్చుకుంటే బాగా యాక్టివ్గా.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్న వ్యక్తి రతిక రోజ్. అందుకే ఈసారి టైటిల్ గెలిచే సత్తా కూడా ఆమెకే ఉంది అని బిగ్ బాస్ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో షో పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.