చంద్రబాబు కేసు వాదించే లాయర్ ఎవరో తెలుసా.? గతంలో ఆయన వాదించిన కేసులు ఏంటంటే.?

Ads

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాన్ని అట్టుడికి ఇస్తున్న విషయం చంద్రబాబు అరెస్ట్. వంకర ధోరణి తో.. కుట్ర పన్ని అరెస్టు చేయించారు అనేది తెలుగుదేశం అభియోగం కాక మా దగ్గర పక్కా సాక్షాలు ఉన్నాయి అనేది రూలింగ్ పార్టీ వాదన. ఏది ఎలా ఉన్నా కేస్ అయితే నడుస్తోంది. మరి కేసు ఉంది అంటే వాదించడానికి వకీలు కావాలి కదా. సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా.. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా వేదికపై చూసిన చర్చనీయాంశంగా మారిన పేరు.

chandrababu naidu wife on arrest issue

ఇప్పుడు చంద్రబాబు కేసును వాదించబోయేది లూథ్రా.. కావడంతో అసలు అతను ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి నటిజెన్లు ఎక్కువ సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసును డీల్ చేసింది కూడా ఈ వకీల్ సాబే.. ఆనాడు సునాయాసంగా చంద్రబాబును ఆ కేసు నుంచి బయటపడేశాడు కాబట్టి ఇప్పుడు ఈ కేసు నుంచి కూడా బాబుని అతడే గట్టెక్కిస్తాడు అని టిడిపి అభిమానులు ఆశపడుతున్నారు.

Ads

సుప్రీం కోర్టులో ప్రముఖ లాయర్ గా పేరు పొందిన సిద్ధార్థ లూథ్రా…గతంలో రాజీవ్ హత్య కేసు, తెహ‌ల్కా గట్టం, నిర్భయ.. లాంటి పలు ముఖ్యమైన కేసులలో వాదించారు. అతని వాగ్దాటి ముందు అపొనెంట్ ఎంతటి వారైనా నిలబడడం కష్టమే…అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబుని కూడా కడిగిన ముత్యంలా బయటకు తీసుకు వస్తారని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి.

2002 లో జస్టిస్ వెంకటస్వామి కమిషన్ ముందు తెహెల్కా మ్యాగజైన్‌కు ప్రాతినిధ్యం వహించిన లూథ్రా అప్పటి కేంద్ర రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన విధానం…అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. 2017 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన లూథ్రా … వాదనలోని పటిమకు యావత్ భారతదేశం గర్వించింది.

Previous articleబిగ్‌బాస్ తెలుగు -7 విన్నర్ అయ్యే కంటెస్టెంట్ వీళ్లేనా..? నాగార్జున హింట్ ఇచ్చేశారా..?
Next articleహెయిర్ డ్రైయర్ లు ఇస్త్రీ పెట్టెలు కాదు… శ్రీలంక బోర్డుని చూసైనా మన BCCI నేర్చుకుంటే బాగుంటది.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.