Ads
కూరలో వాడే ఉప్పు దగ్గర నుంచి నింగిలో ఎగిరే విమానం వరకు సువిశాలమైన సామ్రాజ్యాన్ని విస్తరించిన సంస్థలు టాటా సంస్థలు. సుమారు రెండు శతాబ్దాలుగా భారత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసగా నిలిచిన సంస్థ టాటా సామ్రాజ్యం. ప్రస్తుతం టాటా సామ్రాజ్యానికి అధినేత రతన్ టాటా. అయితే ప్రస్తుతం టాటా సామ్రాజ్యానికి ఉన్న కీర్తి ఒక్క రోజులో ఎప్పుడు రాలేదు. టాటా సంస్థలను దశదిశలా వ్యాప్తించడం కోసం రతన్ టాటా తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు.
టాటా సంస్థను ఎంతో ఉన్నతికి తీసుకుపోయిన రతన్ టాటా మాత్రం నేటికీ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. అయితే ఆయన ఒంటరితనానికి అసలు కారణం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటో తెలుసా.. భారత్ ..చైనా మధ్య జరిగిన యుద్ధం కూడా రతన్ టాటా ఒంటరితనం వెనక ఒకానొక కారణం అట. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన పట్నం ప్రేమ గురించి రతన్ టాటా మొదటి సారిగా పెదవి విప్పారు.
Ads
తన ప్రేమాయణం దగ్గర నుంచి…ప్రేమ విఫలమవ్వడం వరకు అన్ని పంచుకున్నారు. విదేశాల్లో చదువుకుంటున్న టాటా అక్కడ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత వారు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇంతలో టాటాగారి తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు రావాల్సి వచ్చింది.
సరే పెళ్లి ఇండియాలో చేసుకుందాం అనుకునే సమయానికి ఇండియా చైనా వారు వచ్చింది. దీంతో అప్పటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండడంతో పెళ్లయిన తర్వాత అమ్మాయిని ఇండియాకు పంపడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు.సొంత గడ్డను వదిలిపోవడం ఇష్టం లేని రతన్ టాటా స్వదేశాన్ని వదిలి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి సముఖత చూపలేదు. దాంతో వాళ్ళిద్దరి ప్రేమ…అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ఒక యుద్ధం కారణంగా రతన్ టాటా జీవితం ఎడారిగా మిగిలిపోయింది.