Ads
రవితేజ నిర్మాణంలో ఇవాళ థియేటర్లలో విడుదల అయిన సినిమా “ఛాంగురే బంగారు రాజా”. రంగురాళ్ల చుట్టూ తిరిగే సినిమా ఇది. కామెడీ, క్రైమ్ ఎంటర్టైనర్ జోన్ లో ఉండే ఈ సినిమాలో రాజశేఖర్ అణిగి, రవి బాబు, సత్య అక్కల, కార్తీక్ రత్నం, రాజ్ తిరందాసు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీష్ వర్మ వహించారు.సంగీతం కృష్ణ సౌరభ్ అందించారు.
- చిత్రం : ఛాంగురే బంగారు రాజా
- నటీనటులు : కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు, అజయ్, ఎస్తేర్, వాసు ఇంటూరి..
- నిర్మాత : రవితేజ
- దర్శకత్వం : సతీష్ వర్మ
- సంగీతం : కృష్ణ సౌరభ్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2023
స్టోరీ :
ఒక చిన్న ఊరిలో ఉండే ఒక మెకానిక్ (కార్తీక్ రత్నం) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అనుకోకుండా అతను ఒక మర్డర్ లో ఇరుక్కుంటాడు. తన పేరుని అందులో నుండి తీసేయడానికి కష్టపడుతూ ఉంటాడు. తను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి అతను చేసే ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? చివరికి అతను నిర్దోషి అని తెలిసిందా? అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
Ads
కార్తీక్ రత్నం (కేరాఫ్ కంచరపాలెం, నారప్ప) ఫేమ్. ఇప్పుడు ఛాంగురే బంగారు రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఒక మెకానిక్ తనని తాను ఒక నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసే ప్రయాణంలో అతని ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనే సింపుల్ స్టోరీ లైన్ మీద సినిమా ఉంటుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో అందరూ కూడా కూడా వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
కార్తీక్ రత్నం కి మరొక మంచి పాత్ర దొరికింది. ఇందులో కార్తీక్ రత్నం చాలా సహజంగా నటించారు. అలాగే కార్తీక్ రత్నం తర్వాత సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర సత్య.ఈ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. పాటలు పరవాలేదు. సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ కథలో మాత్రం అక్కడక్కడ కొత్తదనం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- కార్తీక్ రత్నం నటన
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- సాగదీసినట్టుగా ఉన్న కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, ఒక మంచి కామెడీ సినిమా చూద్దాం అనుకునే వారికి, రొటీన్ కథ అయినా పర్వాలేదు ఎంటర్టైనింగ్ గా ఉంటే చాలు అని అనుకునే వారికి చాంగురే బంగారు రాజా సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.