ఇంత డ్రామా దానికోసమేనా “రతిక”.? పెద్ద ప్లాన్ వేసింది అంటూ అసలు విషయం బయటపెట్టిన షకీల.!

Ads

రెండవ వారం పవర్ అస్త్ర కోసం రణధీర, మహాబలి టీమ్ మధ్య జరిగిన పోటీ హౌస్ లో సరి కొత్త వాదనలకు వేదిక అయ్యింది. మహాబలి టీమ్ పై విజయం సాధించిన రణధీర టీమ్ మాయాస్త్ర రెండో కీని సొంతం చేసుకుంది. దానితో పాటుగా బిగ్ బాస్ లో రెండవ పవర్ అస్త్ర పొందడానికి రణధీర టీం లోని సభ్యులు అర్హులయ్యారు.

అయితే తర్వాత ట్రస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ టీం లో ఉన్న సభ్యుల నుంచి అనర్హులు అనుకున్న వారి దగ్గర మాయాస్త్ర ముక్కలను తీసుకొని అర్హులు అన్నవారికి ఇవ్వాలి అని…అలా ఎక్కువ ముక్కలు ఎవరి దగ్గర ఉంటే వాళ్లే పవర్ అస్త్రా కి అర్హులవుతారని చెప్పారు. అంతేకాకుండా ఇలా చేసేటప్పుడు ఏ కారణం చేత వారు అనర్హులుగా భావిస్తున్నారో కూడా వివరించాలని పేర్కొన్నారు.

ఈ ఒక్క టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో నిన్న పెద్ద రేంజ్ లో రచ్చ రేపింది. నిన్నటి వరకు కామ్ గా ఉన్న రతిక తన అసలు రంగులు చూపించి.. తన సొంత టీం సభ్యులనే బఫున్స్ అని . రెండు అస్త్ర గెలుచుకున్న వారికి నాలుగు వారాల ఇమ్యూనిటీ లభించడంతోపాటు నామినేషన్ నుంచి బయటపడతారు అని బిగ్ బాస్ తెలియజేయడంతో ఆట మరింత రసవత్తంగా మారింది. మొదటి శుభశ్రీ ,శోభా శెట్టి దగ్గర నుంచి తీసుకున్న మాయ అస్త్ర భాగాన్ని ప్రిన్స్ యావర్ కు అందించగా పల్లవి ప్రశాంత్ అమరదీప్ దగ్గర నుంచి తీసుకున్న భాగాన్ని శివాజీకి ఇచ్చాడు.

Ads

రతిక అందరి దగ్గర ఉన్న భాగాలను ఎక్కువ శివాజీకి ఇచ్చి అతని విన్నర్ చేస్తే బాగుంటుంది అని సడన్గా చెప్పింది. అయితే టీంలో మిగిలిన వారు అందుకు ఒప్పుకోలేదు.. ఇంకేముంది రాధిక ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. మొదట ఆమె టీం నెంబర్ అయిన దానిపై విరుచుకుపడింది…దానిని నచ్చ చెప్పబోతుంటే వినకుండా ఆమెపై అరచి గోల చేసి…గందరగోళం చేసింది. అప్పటివరకు సైలెంట్ గా ఉన్నదామిని కూడా వైరల్ యాంగిల్ బయటపెట్టి రతిక కు తన స్టైల్ ఘాటు రిప్లై ఇచ్చింది.

image credits: tv9 telugu

ఇద్దరి మధ్య షురూ అయిన మాటల యుద్ధం దామిని టీం లో నుంచి వెళ్ళిపో అని రతిక ను అనేంతవరకు వెళ్ళింది. దానికి రజక నువ్వెవరు నన్ను వెళ్ళమనడానికి.. అని అరిచి గోల చేసింది. ఇంత డ్రామా టిఆర్పి కోసమే కదా…అని దామిని ఎత్తి పొడవడంతో.. అవును నేనే కాదు అందరూ చేసేది అందుకోసమే అంటూ మరింత రెచ్చిపోయింది. రతిక ప్రవర్తనకు హర్ట్ అయిన దామిని కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడితో శాంతించకుండా రతిక తన టీమ్ లో ఉన్నదందరూ బఫూన్స్ అని.. చండాలమైన టీం అని నోటికొచ్చినట్లు మాట్లాడింది. అప్పటివరకు పర్యవేక్షకుడిగా మౌనంగా ఉన్న సందీప్ ఆమె ప్రవర్తన తప్పు అని అన్నాడు.

రతిక ప్రవర్తనకు సందీప్ కూడా ఆమెపై ఫైర్ అయ్యాడు. అయినా ఏమాత్రం తగ్గకుండా రతిక తన దారి తనదే అన్నట్లు మాట్లాడుతూ ఉంది. అప్పటివరకు మౌనంగా ఉన్న షకీలా ,రతిక అసలు ఉద్దేశం బయటపెట్టేసింది.. కావాలని కంటెంట్ కోసం పెద్ద ప్లాన్ వేసుకొని అలా అరిచి గోల చేస్తుంది.. ఇవ్వనివ్వండి.. అని సైలెంట్ గా ఉన్న మాట అనేసింది. లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ పై అందరూ సీరియస్ అయినప్పుడు ఏడ్చి గగ్గోలు పెట్టి సింపథీ కొట్టేశాడు. పాపం రతిక పాప అదే ఇప్పుడు ట్రై చేయబోయి అందరికీ అడ్డంగా దొరికిపోయింది.

Previous articleరవితేజ నిర్మాణంలో వచ్చిన “ఛాంగురే బంగారు రాజా” హిట్టా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్!!!
Next articleసినిమా విడుదలైన ఏడాది తర్వాత OTT లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా చూసారా.? ఇందులో ఏముందంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.