Ads
ఈ మధ్య కాలంలో చాలా మంది ఉదయం పూట కూడా నైటీలనే వేసుకుంటున్నారు. నైటీ చాలా కంఫర్ట్ గా ఉంటుందని చీరలు, డ్రెస్సులు పక్కన పెట్టేశారు. అయితే నిజానికి నైటీని రాత్రి పూట మాత్రమే వేసుకోవాలి. పగటిపూట వేసుకోవడం మంచిది కాదు. దీని వెనుక ఉండే కారణాలు చూస్తే నైటీని ఉదయం పూట వేసుకునే వాళ్ళు తప్పకుండా మానేస్తారు.
మామూలుగా మనం రాత్రి నిద్ర పోయినప్పుడు మన ఒంటి మీద చాలా క్రిములు చేరుతాయి. పైగా ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం కారణంగా క్రిములు మరింత ఎక్కువవుతాయి. ఇలా మనం నిద్రలేచిన తర్వాత బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి అనవసరంగా ఇబ్బంది వస్తుంది. అందుకనే పూర్వీకులు స్నానం చేస్తే కానీ వంట గదిలోకి వెళ్ళద్దు అని చెప్తూ ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే చాదస్తం అని అనుకుంటారు.
Ads
కాని నిజానికి సైంటిఫిక్ రీజన్ కూడా దీని వెనక ఉంది. ఆ నైటీ తో మనం వేరే గదిలోకి వెళ్తే క్రిములు వ్యాపిస్తాయి. ముఖ్యంగా వంటగదిలోకి వెళ్తే వంట పదార్థాలపై బ్యాక్టీరియా పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఇలా కలుగుతాయి. కాబట్టి స్నానం చేసి మాత్రమే వంట గదిలోకి వెళ్లాలి.
అందుకని ఉదయం పూట రాత్రి వేసుకున్న నైటీ తో లోపలికి వెళ్ళకూడదు. వీలైనంత త్వరగా స్నానం చేసేసి ఉతికిన దుస్తులు ధరించాలి. ఒకవేళ కనుక మీరు ఈ తప్పులు చేస్తున్నట్లయితే వాటిని సరి చేసుకోండి. లేదంటే అనవసరంగా ఆరోగ్యానికే ముప్పు కలుగుతుంది.