వేణు నటించిన వెబ్‌సిరీస్ “అతిధి” ఎలా ఉంది..?

Ads

హీరో వేణు తొట్టెంపూడి…ప్రస్తుతం జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోయినా 90 లోని ప్రేక్షకులకు మాత్రం వేణు గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. లయ కాంబినేషన్ లో వచ్చిన స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వేణు తనదైన నటనతో ,మంచి డైలాగ్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. క్రమంగా అవకాశాలు తగ్గడంతో మెయిన్ హీరో నుంచి సైడ్ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసిన వేణు ఆ తర్వాత గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

venu athidhi series review

గత సంవత్సరం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా తిరిగి వేణు రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం మొదటిసారి వేణు అతిధి అనే హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఒక కమెడియన్ రోల్ లో లేక ఒక హీరో రోల్ లో పరిచయం ఉన్న వేణు మొదటిసారి ఒక థ్రిల్లర్, హారర్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

venu athidhi series review

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ను ప్రవీణ్ నిర్మించారు. ఇందులో వేణు తో పాటు అవంతిక మిశ్రా ,అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ కీలకపాత్రలో నటించారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి అంటే.. సంధ్యా (అదితి గౌతమ్),రవి వర్మ(వేణు తొట్టెంపూడి) సంధ్యా నిలయం అనే ఒక పెద్ద బిల్డింగ్ లో ఉంటుంటారు. స్వతహాగా స్టోరీ రైటర్ అయినా రవివర్మ భార్య సంధ్యకు పక్షవాతం రావడంతో పాపం ఆమె బెడ్డుకే పరిమితం అవుతుంది. మరోపక్క రవి వర్మ భార్యకు సేవలు చేస్తూ కాలక్షేపానికి కథలు రాస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు.

Ads

venu athidhi series review

అయితే అతను రాసిన స్టోరీలో లాగానే ఒకరోజు సడన్గా వర్షం కురుస్తున్న టైం లో రవివర్మ బంగ్లాకి మాయా అనే ఒక అమ్మాయి వస్తుంది. మరోపక్క సవేరి అనే యూట్యూబర్ అసలు దయ్యాలే లేవు అనే కాన్సెప్ట్ తో వీడియోలు తీసి తన చానల్లో పెడుతుంటాడు. అలాంటి వ్యక్తి ఆరోజు తనని దయ్యం తరుముతోంది. అని భయంగా రవివర్మ బంగ్లాకు చేరుకుంటాడు. అక్కడే ఉన్న మాయని చూసి దెయ్యమని సందేహపడతాడు. అయితే సడన్ గా ఆ ఇంట్లోనే మాయ మరణిస్తుంది. ఇంతకీ మాయని చంపింది ఎవరు? సవారి దెయ్యాన్ని కనుక్కోగలిగాడా? ఈ స్టోరీలో అసలు వేణు పాత్ర ఏంటి? తెలియాలి అంటే వెబ్ సిరీస్ ని చూడాల్సిందే.

venu athidhi series review

ఈ వెబ్ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రూపొందించడం జరిగింది. మొదటి ఎపిసోడ్ చూడడం మొదలుపెడితే మిగిలిన అన్ని ఎపిసోడ్స్ చూడాలి అనే క్యూరియాసిటీ డెవలప్ కాక మానదు. ఒక కమెడియన్ రోల్ లో అద్భుతంగా నటించే వేణు సీరియస్ పాత్రలో ఇంకా అద్భుతంగా నటిస్తాడా అని ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. రచయిత రవి వర్మగా వేణు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు మంచి హారర్ మూవీస్ నచ్చే పని అయితే తప్పకుండా ఈ వెబ్ సిరీస్ ని చూడండి.

Previous articleఫేస్బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ వల్ల ఆ 18 ఏళ్ల యువతి పెళ్లి ఆగిపోయింది.! ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి.?
Next article“నైటీలు” పగలు వేసుకోవడం వల్ల కలిగే ఈ నష్టాల గురించి తెలుస్తే…ఆడవాళ్ళు ఇంకోసారి ఆ తప్పు చేయరు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.