Ads
సాధారణంగా మంచి మంచి కాస్ట్యూమ్స్ ని హీరో హీరోయిన్లు ధరిస్తూ ఉంటారు. వీటి కోసం ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా నటీ నటులు అందంగా కనపడాలని మంచి మంచి దుస్తులను ధరిస్తూ వుంటారు. నిజానికి చాలా రకాల డ్రెస్సెస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆ కాస్ట్యూమ్స్ ని ఒకసారి ఉపయోగించిన తర్వాత ఏం చేస్తారో మీకు తెలుసా..? దాని కోసమే ఇప్పుడు చూద్దాం.
గతంలో అయితే హీరో హీరోయిన్లు వారి యొక్క కాస్ట్యూమ్స్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసే వాళ్ళు. ఒకవేళ నటీ నటులకి ఆ దుస్తులు నచ్చి వాటిని తీసుకెళ్లి పోయేవారు. కొంత మంది మాత్రం ఛారిటీల కోసం డ్రెస్సులను వేలం వేసేవారు.
ప్రత్యేకంగా దూకుడు సినిమా కోసం మహేష్ బాబుకి, సమంతకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. వాటిని సినిమా తర్వాత వేలం వేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్స్ ని కూడా వేలం వేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ విధానంలో మార్పు వచ్చింది. కాస్ట్యూమ్ డిజైన్ చేయడం తగ్గింది. ప్రత్యేకంగా యాక్టర్ల కోసం పర్సనల్ స్టైలిస్ట్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయి అనేది చూసి పాత్రకు తగ్గట్టుగా కాస్ట్యూమ్లను నిర్ణయిస్తారు.
Ads
ఇదిలా ఉంటే ఒక్క సారి నటీ నటులు కాస్ట్యూమ్స్ ని డిజైనర్ల నుంచి అద్దెకి తెచ్చుకుంటారు. వాటిని ఉపయోగించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇచ్చేస్తారు. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. పైగా మళ్లీ వాడొచ్చు. అల వైకుంఠపురం సినిమాలో పూజ హెగ్డే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేసిన కాస్ట్యూమ్స్ ని అద్దెకు తెచ్చుకుని వేసుకున్నారు.
చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాస్ట్యూమ్స్ అయితే కొంత మంది పక్కన పెట్టేస్తారు. కొందరు స్పెషల్ కలెక్షన్ అని చెప్పి ఆ దుస్తులను మార్కెట్లో విడుదల చేస్తారు. లేదంటే హీరోయిన్ ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ని బ్యాగ్రౌండ్ డాన్సర్స్ వాడతారు. ఇలా కాకుండా మనకి తెలియకుండా చాలా సినిమాల్లో వేసుకున్న దుస్తులనే మళ్లీ రిపీట్ చేస్తూ ఉంటారు.