సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఫోటో వెనక కథ ఏంటి.? ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ పాప ఎవరు.?

Ads

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ఒక చిన్న పాపతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎన్టీఆర్ తో ఇంత క్లోజ్ గా ఉన్న పాప ఎవరా అని ఆ అమ్మాయి గురించి నేటిజెన్లు తెగ ఆరాలు తీస్తున్నారు. ఈ విషయంపై నెట్లో హాట్ డిస్కషన్ కూడా జరుగుతున్నాయి.

పైగా ఆ పాపతో ఉన్న ఎన్టీఆర్ ఎంతో హ్యాపీగా ఉండడంతో నందమూరి అభిమానులు ఆ ఫోటోని తెగ షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఫోటో అయితే వైరల్ అయింది కానీ పాప ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ అయినా ఆటో రాంప్రసాద్ ఆ ఫోటో గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా?

Ads

జూనియర్ ఎన్టీఆర్ ఒడిలో నవ్వుతూ కూర్చున్న ఆ క్యూట్ పాప మరెవరో కాదు ఆటో రాంప్రసాద్ మేనకోడలట. ఈ విషయాన్ని స్వయంగా అతను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నాడు.ఇది విన్న ఎవరికైనా జబర్దస్త్ కమెడియన్ మేనకోడలు ఎన్టీఆర్ ని ఎప్పుడు కలిసింది అన్న సందేహం రాకమానదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ మూవీస్ సందర్భంగా సెట్స్ లో ఉన్న ఎన్టీఆర్ ని కలవడానికి రాంప్రసాద్ వెళ్ళినప్పుడు అతనితో పాటు అతని మేనకోడలు కూడా వెళ్ళింది. ఇక పిల్లలంటే ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ ఆ క్యూట్ పాపతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలే ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యాయి. ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న దేవర చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ…జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Previous articleసినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని..సినిమా తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Next articleటీం ఇండియాకు స్పాన్సర్ చేయడం ఈ కంపెనీలకు కలిసి రావట్లేదా.? అప్పుడు సహారా..ఇప్పుడు డ్రీం11.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.