Ads
రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ క్షణం ఎలా మారిపోతుందో కూడా మనం ఊహించలేము. అందుకనే ప్రస్తుతాన్ని మనం ఆనందంగా అనుభవించాలి. అనుకున్నవి చేయాలి. అయితే పుట్టుక, చావు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. జీవితంలో మనం అనుకున్నది చేయాలంటే చనిపోయేలోగా చేయాలి. సాధారణంగా మనుషులకి చాలా పనులు చేయాలని ఉంటుంది.
అలానే కొన్ని ఆనందాలను అనుభవించాలని ఉంటుంది. కొన్ని కోరికలు కూడా ఉంటాయి. అయితే ఇలా ఏం చేయాలన్న చనిపోయే వరకు మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఒక ఆమెకు ఎదురైంది. ఆమె పేరు అజూ.
ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్లు చెప్పేశారు. అయితే ఆమె పరిస్థితి చూసిన తన భర్త రాజేష్ ఆఖరి కోరికను తీర్చాలనుకున్నాడు. ఎప్పటి నుండో కూడా అజూ కి క్రికెట్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా స్టేడియంలో చూడాలని ఉండేది. కానీ ఎప్పుడూ కూడా అది జరగలేదు. ఆమె మరణించేలోగా ఆ కోరిక తీర్చాలని భర్త అనుకున్నాడు.
Ads
దీంతో ఎలా అయినా సరే క్రికెట్ టికెట్ కావాలని తన స్నేహితులతో చెప్పి ప్రయత్నం చేశాడు. ఆఖరికి టికెట్లు దొరికాయి. స్టేడియం పక్కనున్న ఆసుపత్రి వారితో కూడా మాట్లాడి తన భార్య పరిస్థితి బాగోకపోతే చికిత్స చేయిస్తానని చెప్పి ఏర్పాట్లు చేశాడు. అలానే స్టేడియం లో ఉన్న పోలీసులుకి కూడా అతని పరిస్థితిని వివరించాడు. అజూ ఆఖరికి ఎప్పటి నుండో క్రికెట్ చూడాలనుకున్న కోరికను తీర్చుకుంది. నిజానికి ఆమె స్టేడియంలో క్రికెట్ చూస్తున్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంది.
ఆఖరికి ఆమె చివరి కోరిక నెరవేరింది. మ్యాచ్ కి వెళ్లి వచ్చిన కొన్నాళ్ళకి ఆమె మరణించింది. ఈ విషయాన్ని గత సంవత్సరం రాజేష్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. కొన్ని రోజులలో చనిపోతుందని తన భార్యకి తెలిసినా సరే ఎంతో ధైర్యంగా ఉందని అతను చెప్పాడు. ఎప్పుడు కూడా జీవితంలో జరిగిపోయిన వాటిని తలచుకుని బాధ పడకండి. అదే విధంగా భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ భయపడకండి. ప్రస్తుతాన్ని ఆనందంగా అనుభవించండి అని రాజేష్ తన భార్య నుండి నేర్చుకున్న విషయాలను చెప్పాడు.