బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ 5 సీరియల్ హీరోయిన్స్ వీళ్ళే…లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే.?

Ads

తెలుగులో రెండు గంటల్లో పూర్తయ్య సినిమా కంటే కూడా సంవత్సరాలు తరబడి సాగదీతగా జరిగే సీరియల్స్ కి అభిమానులు ఎక్కువ. మరి కొంతమంది సీరియల్ హీరోయిన్స్ అయితే ప్రేక్షకులు తమ ఇంటి సభ్యులుగా పరిగణించడమే కాకుండా సీరియల్ లో వాలు పడే కష్టాలకు ఇక్కడ వీలు కన్నీళ్లు కారుస్తుంటారు. ఇంట్లో వంట చేయడం అన్నా మిస్ అవుతారేమో కానీ టైంకి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడటం అస్సలు మిస్ కారు.

అభిమానులకు మనసుకు హత్తుకునే విధంగా ఉన్న కొన్ని సీరియల్స్ టిఆర్పి రేటింగ్ కూడా ఎంతో హెవీ గానే ఉంటుంది . సీరియల్ ముఖ్యంగా హీట్ అవ్వడానికి కొన్ని సందర్భాల్లో అందులో ఉన్న నటీనటులే కారణం అని చెప్పవచ్చు. మరి ఆ విధంగా ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయి బుల్లితెరపై రాణిస్తున్న ఆ ఐదు మంది సీరియల్ హీరోయిన్స్ ఎవరో చూద్దామా…

మేఘన లోకేష్

శశిరేఖా పరిణయం సీరియల్ తో మంచి బ్లాక్ బస్టర్ సంపాదించిన సీరియల్ నటి మేఘన లోకేష్. ఇక ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా మంచి సక్సెస్ ని కూడా అందుకుంది.

ఐశ్వర్య పిస్సే

అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా తన మొలితర ప్రయాణం మొదలుపెట్టిన ఐశ్వర్య…. తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ భాషల్లో కూడా పలు సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం జీ తెలుగు సీరియల్ లో నటిస్తున్న ఐశ్వర్య ప్రస్తుతం బుల్లితెర పై ది బెస్ట్ టెలివిజన్ స్టార్స్ లో ఒకరు.

Ads

అషికా పడుకొనే

త్రినయని సీరియల్ తో అషికా పడుకొనే బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించి అప్పటికి ఈ సీరియల్ తెచ్చిన క్రేజ్ ఆమెను బుల్లితరపై టిఆర్పి రేటింగ్ స్టార్ గా మార్చేసింది.

దీప్తి మన్నే

రాధమ్మ కూతురు అనే సీరియల్ లో అక్షర గా…కలెక్టర్ అమ్మగా…విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో ఈమె ఒకరు. ఇప్పుడు రాధమ్మ కూతురు తో పాటు జగదాత్రి సీరియల్ లో టైటిల్ రోల్ కూడా పోషిస్తుంది దీప్తి.

వర్షా

ప్రేమ ఎంత మధురం అనే ఏజ్ బార్ లవ్ స్టోరీ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన వర్షా…నటిస్తోంది ఒక్క సీరియల్ అయినప్పటికీ ప్రస్తుతం ఆమె టాప్ రేటింగ్ లో ఉంది. జీ తెలుగులో ఈ సీరియల్ వన్ ఆఫ్ ద నెంబర్ వన్ సీరియల్ గా మంచి టిఆర్పి తో కొనసాగుతోంది

Previous articleఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాప…ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్! ఎవరో గుర్తుపట్టారా..?
Next articleచనిపోతున్న తన భార్య చివరి కోరిక తీర్చిన భర్త..రియల్లీ హ్యాట్సాఫ్.! ఇంతకీ ఆమె ఏం కోరిందంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.