Ads
మన శరీరంలో జరిగే మార్పులను బట్టి మన అనారోగ్య సమస్యలు గుర్తించొచ్చు. నిజానికి ఎన్నో విషయాలు మనకి తెలిసినప్పటికీ తెలియని విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. మన చేతి గోళ్ళ మీద కూడా నెలవంక లాంటి ఆకారం ఉంటుంది. మామూలుగా ఇది అందరికీ ఉంటుంది కదా కొత్తగా ఏం వినాలి అని అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది ఎన్నో విషయాలను మనకు తెలుపుతుంది. కేవలం దీనిని చూసే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మరి ఇక దీని కోసం ఇప్పుడే చూసేద్దాం.
చేతి గోళ్ళ మీద అర్ధచంద్రాకారంలో వుండే దానిని లునులా అని అంటారు. ఇది ఎంతో సున్నితమైన భాగం. లాటిన్ లో లునులా అంటే స్మాల్ మూన్ అని అర్థం. ఒకవేళ కనుక ఈ లునులా దెబ్బ తింది అంటే గోరు ఎదగడం మానేస్తుంది. పైగా లునులా బట్టి మనం మన హెల్త్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి మీ గోళ్ళని చూసుకోండి.
Ads
మీ గొర్ల మీద కనుక లునులా లేదు అంటే మీకు రక్తహీనత, పౌష్ఠికాహార లోపం ఉండొచ్చు. అదే ఒకవేళ మీ లునులా అనేది బ్లూ కలర్ లో ఉంటే డయాబెటిస్ రాబోతోందని అది సూచిస్తోంది. ఒకవేళ కనుక పూర్తిగా తెల్లగా పాలిపోయి ఉంటే కూడా డయాబెటిస్ రాబోతోంది అని తెలుసుకోవచ్చు.
అదే రెడ్ కలర్ లో ఉంది అంటే హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. మీ గోరు మీద లునులా చాలా చిన్నగా గుర్తుపట్టలేనంతగా ఉంది అంటే జీర్ణ సమస్యలు మీకు ఉన్నాయని.. శరీరంలో విష వ్యర్ధ పదార్ధాలు బాగా పెరిగిపోయాయని అర్ధం. కాబట్టి ఒకసారి లునులా చూసి మీ ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఒకవేళ నిజంగా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుని ఆరోగ్యంగా ఉండండి.