గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ రాధ రెండవ కూతురు..! ఎలా ఉందంటే..?

Ads

ప్రముఖ నటి రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె 80వ దశకంలో టాప్ హీరోయిన్ గా తెలుగు,తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో రాణించింది. తెలుగులో అప్పటి అగ్ర హీరోలందరితో నటించి, అలరించింది.

తాజాగా రాధ మొదటి కుమార్తె కార్తీక వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పెళ్లిలో రాధ రెండవ కుమార్తె తులసి నాయర్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆమె గుర్తుపట్టనంతగా మారిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ1981-1991 వరకు తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణించింది. ఆమె ఎన్నో హిట్ సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అప్పటి యూత్ ఆమె అందానికి, డ్యాన్స్ కి ఫిదా అయ్యారు. తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో కలిపి దాదాపు 250కు పైగా చిత్రాలలో నటించింది. అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
1991లో హోటల్ వ్యాపారి రాజశేఖరన్ నాయర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కార్తీక నాయర్, తులసి నాయర్, ఒక కుమారుడు విఘ్నేష్ నాయర్ ఉన్నారు. రాధ లాగే ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీక టాలీవుడ్ లో నాగ చైతన్య నటించిన జోష్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తరువాత అంతగా రాణించలేదు. తులసి నాయర్ తమిళ సినిమా కాదల్‌తో ఎంట్రీ ఇచ్చారు.
ఈ మూవీ తెలుగులో కడలి పేరుతో డబ్ అయ్యింది. ఆమె రెండు సినిమాలలో మాత్రమే నటించారు. తాజాగా జరిగిన కార్తిక పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో తులసి నాయర్ కూడా ఉంది. అయితే ఆమె కొంచెం బొద్దుగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఆమె కొంచెం లావుగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: PERFUME REVIEW: సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టేసిన “పర్ ఫ్యూమ్” …స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Previous articleమీ చేతి గొర్లపై తెల్లటి అర్ద చంద్రాకారం గుర్తు ఉందా.? దాన్ని బట్టి మీ ఆరోగ్యం గురించి ఇలా చెప్పచ్చు.!
Next articleభార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. భర్త ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 పనులు అస్సలు చేయకూడదు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.