Ads
బరువు తగ్గడం పెరగడం అనేది మనం తినే ఆహారం, మన జీవన శైలి బట్టీ ఉంటుంది. కొంతమంది ఎక్కువ బరువు కలిగి ఉంటే కొందరు మాత్రం సన్నగా, తక్కువ బరువు కలిగి వుంటారు. పెళ్లి కి ముందు అలా వున్నా కానీ పెళ్లి తరవాత మాత్రం బరువు పెరిగిపోతూ వుంటారు. దాదాపు అందరు ఇంతే. నిజానికి పెళ్లి తర్వాత చాలా మంది ఆడవాళ్లు బరువు పెరిగిపోతూ ఉంటారు.
ఎంత బరువు తక్కువగా ఉండే వాళ్ళైనా సరే లావుగా మారిపోతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా…? పెళ్లికి ముందు తక్కువ బరువు ఉండి, పెళ్లి అయిన తర్వాత ఎక్కువ బరువు ఎందుకు అయిపోయారు అని..
దాని కోసమే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెళ్లి తర్వాత ఎంత సన్నగా ఉండే వాళ్ళు అయినా సరే బొద్దుగా తయారైపోతూ ఉంటారు. కాస్తైనా ఒళ్ళు చేస్తారు. పెళ్ళికి ముందు చదువు, ఉద్యోగం ఇలా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. పైగా అప్పుడు తినడానికి శ్రద్ధ ఎక్కువగా అమ్మాయిలు చూపరు. దీంతో ఎక్కువ బరువు కలిగి ఉండరు. పైగా ప్రతీ రోజు చదువుకోవడం.. కాలేజీ కి లేదా ఉద్యోగానికి వెళ్లి రావడం తప్పదు కనుక క్యాలరీలు కూడా ఎక్కువగా కరుగుతూ ఉంటాయి. కానీ పెళ్లి తర్వాత తినే ఆహారం ఎక్కువగా ఉంటుంది.
Ads
చాలా మంది మహిళలకి పెళ్లి తర్వాత బద్ధకం కూడా వస్తుంది. ఈ మూలంగానే ఎక్కువ బరువు పెరిగిపోతూ ఉంటారు. ఎంత సన్నగా వున్న వారైనా సరే బొద్దుగా తయారవుతూ ఉంటారు. పైగా ఇంకో విషయం ఏమిటంటే..? వండిన ఆహారం ఏదైనా వేస్ట్ అయ్యి పోతుంటే.. ఆ ఆహారాన్ని కూడా తినేస్తూ వుంటారు. ఇలా ఎక్కువ ఆహారాన్ని పెళ్లయ్యాక తీసుకుంటూ వుంటారు. పైగా సైంటిస్టులు చెబుతున్నదాని ప్రకారం చూస్తే.. ప్రపంచంలో ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి తర్వాత కొద్ది రోజులకే రెండు కిలోలు పెరుగుతారని సర్వ్ ద్వారా చెప్తున్నారు.
Also Read: ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ 4 నటులు కూడా చనిపోయారు..!