Ads
కొంతమందికి అన్ని వసతులు ఉన్న జీవితంలో సక్సెస్ సాధించడం గగనం అయిపోతుంది. మరోపక్క కనీస వసతులు కూడా లేని కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఊహించని వండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎంతో కష్టాలు పడి చదువుకోవడమే కాకుండా తమ కెరియర్ ని అద్భుతంగా నిర్మించుకుంటారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు పశువుల కాపరిగా చేసిన వ్యక్తి ప్రస్తుతం కలెక్టర్ గా మారింది.
ఆమె కలెక్టర్ వన్మతి.. ప్రస్తుతం ఆమె సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వన్మతి 2017 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి సివిల్స్ లో టాపర్ గా నిలిచింది. ఇష్టంగా మరచుకుంటే ఎంత కష్టమైనా పని అయినా సక్సెస్ సాధించడం సులువు అని ఆమె చెబుతారు. తమిళనాడులోని సత్య మంగళంకు చెందిన వన్మతి కుటుంబానికి పశువులు జీవనాధారం కావడంతో సాయంత్రం పూట పశువులను కాసేది. వన్మతి తల్లి పాడిని నమ్ముకున్నారు. తండ్రి చెన్నయ్యప్ప క్యాబ్ డ్రైవర్ గా పని చేసేవారు.
Ads
వన్మతికి చిన్నతనం నుంచి ఐఏఎస్ అధికారి కావాలి అన్న ఆశ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు తన వెంట పుస్తకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకునేది. అంతేకాదు టీవీలో “గంగ జమున”, “సరస్వతి” అనే సీరియల్స్ నుండి కూడా స్ఫూర్తి పొందారు అంట ఈ కలెక్టరమ్మ. అలా డిగ్రీ పూర్తి చేసిన వన్మతి ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేయడం మొదలుపెట్టింది. ఒకపక్క జాబ్ చేసుకుంటూ మరొక పక్క సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడమే తన లక్షయంగా పెట్టుకొని విజయం సాధించారు.
అయితే ఆమెకు సక్సెస్ మొదటి అటెంప్ట్ లోనే రాలేదు.. రెండుసార్లు పరీక్షలలో విఫలమైన తరువాత మూడో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. సివిల్స్ లో 150 రెండవ ర్యాంక్ సాధించిన వన్మతి శిక్షణ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే…ఆమె ఇంటర్వ్యూ కి రెండు రోజుల ముందు తన తండ్రి ఐసీయూలో ఉన్నారు అంట. డ్రైవర్ గా పని చేసి వెన్నుముక వ్యాధి వచ్చి హాస్పిటల్ లో పోరాడుతూనే కూతురుని ఐసీయూ నుండే ఇంటర్వ్యూ కి పంపించారు అంట ఆ తండ్రి. ప్రస్తుతం ఈమె సక్సెస్ స్టోరీ ఎందరి కోసం స్ఫూర్తిగా నిలవాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.