సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన డైరెక్టర్ శంకర్, ఖైదీ ఫేమ్ అర్జున్‌దాస్ సినిమా…చూసారా.?

Ads

ఖైదీ మూవీ ఫేమ్ అర్జున్ దాస్.. హీరోగా స్టార్ డైరెక్టర్ నేతృత్వంలో తెరకెక్కిన తమిళ్ మూవీ అనీతి…అప్పుడే ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హాలిడే సీసన్ కావడంతో ఈ వీక్ చాలానే మూవీస్ ఓటీటీ లో విడుదలవుతున్నాయి వాటిలో ఆనీతి కూడా ఒకటి. ఒక ఫుడ్ డెలివరీ బాయ్.. రిచ్ ఫ్యామిలీ లో వర్క్ చేసే ఒక అమ్మాయి.. మధ్యసాగే వెరైటీ ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కించారు.

ఈ మూవీకి ప్రజెంటర్గా స్టార్ డైరెక్టర్ శంకర్ వ్యవహరించారు. ప్రస్తుతం సమాజంలో పేద, గొప్ప వర్గాల మధ్య కంటికి కనిపించకుండా కొనసాగుతున్న అంతరాల కారణంగా జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం నిర్మించడం జరిగింది. డైరెక్టర్ వసంత బాలన్ ఈ చిత్రంలోని ప్రతి ఎమోషన్ ని ఆయనతో అద్భుతంగా తెరకెక్కించారు. మనుషులను చంపాలి అని ఒక మానసిక సమస్యతో బాధపడే యువకుడిగా అర్జున్ దాస్ నటన అద్భుతంగా ఉంది.

Ads

అయితే ఎందరో విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా మాత్రం మిశ్రమ ఫలితాలను దక్కించుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా దుషారా విజ‌య‌న్ నటించింది. ఇదే సినిమా బ్ల-డ్ అండ్ చాక్లెట్ పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఖైదీ మూవీ లో మంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సంపాదించిన అర్జున్ దాస్ ఈ మూవీలో హీరోగా తన నటనా ప్రతిభను చూపించాడు. ప్రస్తుత అతను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి మూవీలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు.

Previous articleపశువుల కాపరి నుంచి ఐఏఎస్ గా మారిన ఈ క్యాబ్ డ్రైవర్ కూతురు గురించి తెలుస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
Next article“బేబీ”లో “వైష్ణవి” భర్తగా నటించిన ఇతను ఎవరో తెలుసా.? ఆ డైరెక్టర్‌ తమ్ముడు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.