రజినీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ ఏ నిర్మాత వల్ల మిస్ అయ్యిందో తెలుసా?

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ఒకరు టాలీవుడ్ తిరుగులేని హీరో అయితే, మరొకరు తెలుగు, తమిళంలో కూడా సూపర్ స్టార్. ఇక ఇద్దరూ స్టార్ హీరోలే అయినా మంచి మిత్రులు కూడా. రజినీకాంత్, చిరంజీవి కాళి,బందిపోటు సింహం లాంటి సినిమాల్లో కలిసి నటించారు.

దాదాపు నాలుగు దశాబ్దాల నుండి స్టార్ హీరో స్టేటస్ ను అనుభవిస్తూ, టాలీవుడ్ ను మెగాస్టార్, ఇక కోలీవుడ్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ ఏలుతున్నారు.కాగా స్టార్ హీరోలు అవకముందు కలిసి నటించిన వీరద్దరు అగ్రహీరోలుగా మారిన తరువాత ఒక్క సినిమాలో కూడా కలిసి నటించింది లేదు. అయితే అప్పట్లో ఒక సూపర్ హిట్ మూవీలో రజినీకాంత్, చిరంజీవి కలిసి నటించే ఛాన్స్ వచ్చిందని,కానీ ఒక అగ్ర నిర్మాత వల్ల ఆ అవకాశం మిస్ అయిపోయిందని సమాచారం.

Ads

ఇకపోతే ఆ సినిమా ఏమిటంటే రంగీలా. ఇక ఈ అద్భుతమైన మల్టీస్టారర్ మూవీని మిస్ చేసిన అగ్ర నిర్మాత వేరేవరో కాదు ఆయనే ప్రొడ్యూసర్ అశ్వినీదత్. ఈ విషయాన్ని ఈమధ్యే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా గురించిన షాకింగ్ విషయాలు కూడా తెలియచేసారు. అశ్వినీదత్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఒకానొక సమయంలో రెండు కథలను చెప్పాడు. అవే రంగీలా మరియు గోవిందా గోవిందా సినిమా కథలు. అయితే నేను ఫస్ట్ రంగీలా మూవీ చేయాలనుకున్నాను. ఇక ఈ చిత్రం కోసం అప్పటికే అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, రజినీకాంత్ లను హీరోలుగా, హీరోయిన్స్ గా శ్రీదేవిని తీసుకోవాలనున్నాను.అయితే చిరంజీవి, రజినీకాంత్ ల వద్దకి వెళ్ళి అతిథి పాత్రలు చేయమంటే ఏమనుకుంటారో అని, అందులోనూ ముక్కోణపు ప్రేమకథ వద్దనుకుని రంగీలా మూవీని వదులుకుని, గోవిందా గోవిందా స్టోరీకి ఒకే చెప్పిణ తరువాత ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో దోపిడి నేపథ్యం అయితే బాగుంటుందని అనిపించింది. అలా నేను గోవిందా గోవిందా సినిమా చేశాను. ఇక బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కి రంగీలా సినిమా వెళ్ళింది అని అశ్వినీదత్ తెలిపారు.

Also Read: రజినీకాంత్ ని బిచ్చగాడు అనుకుని మహిళ భిక్షం వేసిన వేళ..

Previous articleపవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంచ్ లో త్రివిక్రమ్ ఎందుకు మిస్సయ్యాడు?
Next articleఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ చేసిన 9 సినిమాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.