ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ చేసిన 9 సినిమాలు..

Ads

సాధరణంగా ఒక సినిమా విడుదలయ్యింది అంటే, ఆ సినిమాకి తొలి మూడు నాలుగు రోజుల వసూళ్లు చాలా ముఖ్యం. అంటే తొలి వీకెండ్ వసూళ్లు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ కు ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి. దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేస్తుందా,లేదో అనేది వసూళ్లను బట్టే అంచనా వేస్తారు.

Ads

ఈ సంవత్సరం కొన్ని చిన్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ వసూళ్లు చేసి అందరికి షాక్ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏమోటో చూద్దాం..#1.డిజె టిల్లు :
సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి హీరీహిరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి11 న విడుదలైంది. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా వీకెండ్ కి రూ.9.2 కోట్ల షేర్ వసూళ్లు సాధించి హిట్ సినిమాల లిస్ట్ లోకి వచ్చింది. రూ.16.77 కోట్ల షేర్ ను ఫుల్ రన్ లో రాబట్టి బ్లాక్ బస్టర్ సినిమా అయ్యింది.#2.మేజర్:
అడివి శేష్,సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, వీకెండ్ కి రూ.19 కోట్ల షేర్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఫుల్ రన్ లో రూ.32 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.#3.విక్రాంత్ రోణ :
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.1.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, కేవలం 2 రోజులకే బ్రేక్ ఈవెన్ చేసింది. ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.4.05 కోట్ల షేర్ సాధించి, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
#4.బింబిసార :
మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమా రూ. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ చేసింది. ఈ సినీమా ఫుల్ రన్ లో రూ.37.92కోట్ల షేర్ సాధించింది.
#5.బ్రహ్మాస్త్రం :
బాలీవుడ్ హీరోహీరోయిన్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా రూ.4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, కేవలం 2 రోజులకే బ్రేక్ ఈవెన్ చేసింది. ఇక ఫుల్ రన్ లో బ్రహ్మాస్త్రం సినిమా రూ.12.62 కోట్ల షేర్ ను సాధించింది.
#6.కాంతార :
కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి నటించి, నిర్మించిన కాంతార సినిమా రూ.2 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయ్యి, ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్ చేసింది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.27.97 కోట్ల షేర్ ను సాధించి, బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
#7.మసూద :
సంగీత, తిరువీర్, బాంధవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా రూ.1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ చేసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో కలెక్షన్స్ ని రాబడుతోంది.
#8.లవ్ టుడే :
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ, నిర్మించిన ఈ సినిమా రూ.2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ చేసింది. లవ్ టుడే ఇప్పటికీ కూడా కలెక్షన్స్ ను రాబడుతోంది.
#9.హిట్ 2:
హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా రూ.13.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి, వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ చేసింది. ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ ను రాబడుతోంది.
ఇదే ఏడాది విడుదలయిన కార్తికేయ2, సీతా రామం, విక్రమ్ లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ ఇవి ఏవికూడ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ చేయలేదు.

Also Read: సుంద‌ర‌కాండ సినిమా హీరోయిన్ ”అప‌ర్ణ” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Previous articleరజినీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ ఏ నిర్మాత వల్ల మిస్ అయ్యిందో తెలుసా?
Next articleటాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన 9 మంది హీరోలు వీరే.. !
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.