Ads
ఎంతో ఉత్కంఠంగా సాగిన ఆసియా కప్ 2023 సూపర్ ఫోన్ రౌండ్ మ్యాచ్లు ముగిశాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో సాగుతున్న భారత చట్టం ఫైనల్ కి ముందు అనేక లోపాలను ప్రదర్శించింది. ఏమవుతుందిలే అనుకున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆరు పరుగుల తేడాతో టీం ఇండియాను ఓడించింది. ఈ చివరి మ్యాచ్ ఫలితం టీమిండియా పై పెద్దగా ప్రభావం చూపదు కాబట్టి సరిపోతుంది లేకపోతే ఈ ఓటమి పెను భారంగా మారేది.
ఇప్పటికే ఫైనల్ కు భారత్ జట్టు చేరుకోవడంతో ఇది కేవలం నామమాత్రం మ్యాచ్ గానే మిగిలింది. సూపర్ ఫోర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఓవర్లలో 265 పరుగులు చేసి 8 వికెట్లు నష్టపోయింది.
అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఒక ఆటగాడి ప్రదర్శన అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. అతను మరెవరో కాదు టి20 నెంబర్ వన్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్.
Ads
తాజాగా బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. 34 బంతులను ఎదుర్కొన్న అతను కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాకుండా కీలకమైన సమయంలో వికెట్ కోల్పోయి టీం ఇండియా ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. టి20 లలో తన సత్తా చాటే సూర్య మాత్రం వన్డేలలో పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
అయితే అలాంటి వ్యక్తిని ఏకంగా ప్రపంచ కప్ సెలెక్ట్ చేయడంపై ఫ్యాన్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ టీం లో సూర్య ప్లేస్ లో సంజూ సామ్సన్ లేదా తిలక్ వర్మను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని సలహాలు కూడా ఇస్తున్నారు. వన్డే ఫార్మాట్ కి పనికిరాడు అని తెలిసిన వ్యక్తిని ప్రపంచకప్ టీం లోకి తీసుకోవడం అనేది టీం ప్రదర్శన పై భారీ భారాన్ని మోపుతుంది అని సోషల్ మీడియాలో క్రికెట్ విశ్లేషకులు కూడా పోస్టులు పెడుతున్నారు.