“ఉస్తాద్ భగత్ సింగ్” లో పవన్ కళ్యాణ్ కి తల్లిగా నటించే ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల కంటే బిజీగా ఉన్న స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకపక్క రాజకీయాలలో బిజీగా ఉంటూ మరోపక్క తన కెరీర్ ని నెగ్లెక్ట్ చేయకుండా సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో దూసుకుపోతున్నాడు. రియంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి జెట్ స్పీడ్ లో వరుస హిట్టులతో మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ నుంచి నెక్స్ట్ విడుదల కాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’,’ ఓజీ ‘, ‘హరిహర వీరమల్లు’మూవీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క సినిమాని అత్యుత్తమ స్థాయిలో తెరకెక్కించడం జరుగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది.

Ads

వీటితో పాటుగా మిగిలిన రెండు చిత్రాలను కూడా మంచి ప్లానింగ్ తో ముందుకు తీసుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అయింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ పవన్ కి తల్లి క్యారెక్టర్ లో నటిస్తోంది అన్నదే ఆ న్యూస్. ఆమె మరెవరో కాదు ఆక్టర్ గౌతమి ఈ మూవీలో పవన్ కు మదర్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు.

ఈ మూవీలో ఎమోషనల్ టచ్ ఎక్కువగానే ఉంటుందట. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ జంటగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా ఏజెంట్ ,గాండీవధారి అర్జున్ మూవీ ఫేమ్..సాక్షి వైద్యను తీసుకోవాలి అనుకున్నప్పటికీ తెలియని కారణాలవల్ల ఆమెను కాదని మరొక యంగ్ బ్యూటీ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 55 ఏళ్ల గౌతమి 52 ఏళ్ల పవన్ కళ్యాణ్ కు ఈ మూవీలో మదర్ గా నటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Previous articleఇంక ఇతను వెళ్లి ఐపీఎల్ లోనే ఆడుకోవడం మంచిది అనుకుంటా.? వన్ డే లకు వేస్టేనా.?
Next articleమూఢ నమ్మకాలు అనుకోకండి….వెనకున్న ఈ అసలు కారణం తప్పక తెలుసుకోండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.