Ads
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అపజయాలను విజయాలుగా మార్చుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చిరంజీవి. అతను నిజంగా తన స్వయంకృషి తోటే మామూలు యాక్టర్ నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా చిరంజీవి సినిమాలు వచ్చాయంటే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండేది కాదు.
Ads
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిరంజీవి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అతని కెరియర్ లో ఊహించలేని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా ఉన్న చిరంజీవి సినీ జర్నీలో ఒక సినిమా మాత్రం ఎంతో స్పెషల్ గా మిగిలిపోయింది. అతని కెరియర్ తొలి దశలో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. సినిమా తీయడానికి పట్టిన సమయం నెల రోజులు అయితే…థియేటర్లలో దాదాపు 100 రోజులు హై స్కూల్ బోర్డుతో మూవీ రన్ అయ్యింది.
అప్పటివరకు చిరంజీవి కెరీర్ లోని బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాగా నిలిచిపోయిన ఆ చిత్రం…ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య. 1982లో మెగాస్టార్ మాధవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు.ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. రాఘవ నిర్మించిన ఈ చిత్రం ఇండస్ట్రీకి కోడి రామకృష్ణ లాంటి డైరెక్టర్ ను, గొల్లపూడి మారుతీ రావు లాంటి నటుడిని పరిచయం చేసిన చిత్రం. ఈ మూవీ ఏకంగా 512 రోజులు థియేటర్లలో రన్ అయింది అంటే ఎటువంటి రికార్డ్స్ సృష్టించిందో ఊహించండి.