“డబల్ ఇస్మార్ట్” లో రామ్ కి జోడిగా ఆ హీరో కూతురు…ఎంట్రీ మాములుగా లేదుగా.?

Ads

మాస్ అయినా…క్లాస్ అయినా…తనదైన శైలిలో క్యారెక్టర్ కి న్యాయం చేసే నటుడు రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి బ్లాక్ బస్టర్ మాస్ మూవీ తన ఖాతాలో వేసుకున్న రామ్ ప్రస్తుతం స్కంద మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఊర మాస్ హీరో రామ్ పోతినేని కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత రామ్ మరొక సారి పూరి డైరెక్షన్ లో ఇంకో మూవీ చేయబోతున్నారు. అది మరేదో కాదు…ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్. డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఇంపాక్ట్ కూడా ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ గానే ఉంటుంది అని తెలుస్తోంది.

Ads

ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారు. కొద్దిరోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

ఏ మూవీలో హీరో రామ్ పోతినేని ..కానీ హీరోయిన్ విషయంలో మాత్రం కొన్ని మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన ఇద్దరు బ్యూటీలను ఈ మూవీలో తీసుకునేట్లుగా కనిపించడం లేదు. ఈ చిత్రంలో రాంకు జోడిగా బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యను సెలెక్ట్ చేసినట్లు కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ను ఈ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఇంతకీ ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే తప్ప స్పష్టత రాదు.

Previous articleకేవలం 29 రోజుల్లోనే షూటింగ్…ఆడింది 512 రోజులు.! ఈ మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.?
Next articleOTT లో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా చూసారా.? మొదటి రెండు పార్టులు హిట్టే..మరి పార్ట్ 3 లో ఏముంది.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.