“సాయి పల్లవి” విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది.? ఇంక వీటికి అంతు లేదా.?

Ads

మలయాళ నటి సాయి పల్లవి డాన్స్ షో లతో గుర్తింపు పొంది..హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె తన సహజ నటనతో ఎందరో అభిమానులను గెలుచుకున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి తెలుగులో ‘ఢీ’ షో తో పాటు కన్నడ, తమిళ భాషల్లో ప్రసారమైన డాన్స్ షోస్ లో పాల్గొని ప్రతిభ నిరూపించుకున్నారు.

కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు చేసి సాయిపల్లవి..మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా మారారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తర్వాత వచ్చిన ఫిదా చిత్రం తో తెలుగు వారికీ దగ్గరయింది సాయి పల్లవి.గ్లామర్ షో కి దూరం గా.. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకొనే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాల సంఖ్యా చాలా ఎక్కువే.

లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ, విరాట పర్వం చిత్రాల తర్వాత గార్గి చిత్రం మాత్రమే చేసింది సాయి పల్లవి. కానీ ఆ తర్వాత మరో చిత్రం ప్రకటించలేదు సాయి పల్లవి. దీంతో ఆమె నటనకు దూరం కానుందన్న పుకార్లు వినిపించాయి. తాజాగా నాగ చైతన్యతో సినిమా మొదలు అవ్వడంతో ఈ పుకార్లు అన్నిటికి చెక్ పడింది.

ఇది ఇలా ఉంటె..సాయి పల్లవికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.తాజాగా సాయి పల్లవి ఓ ఫోటోలో పూల దండలు వేసుకుని వివాహం చేసుకున్నట్టుగా కనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో సాయి పల్లవి పెళ్లి చేసుకుందా అంటూ వార్తలు ట్రెండ్ అయ్యాయి. అందుకే ఇటీవల సినిమాల్లో కూడా కన్పించలేదు అంటూ ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్లారు.

Ads

అయితే ఆ ఫోటో వెనక కథ ఏంటంటే… సాయి పల్లవి తమిళంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే సాయి పల్లవి ఒక ఫోటోలో దండలతో కనిపించింది. దీంతో వివాహం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఆ ఫోటో పెళ్లి ఫోటో కాదని, అది ఓ సినిమా కార్యక్రమంలోని పూజ ఫోటో అని విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ ఫోటోపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

వ్యూస్ కోసం ఇలా ఏది పడితే అది రాసేస్తారా అంటూ సాయి పల్లవి ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో చూస్తేనే తెలుస్తుంది…అందులో అసలు పెళ్లి బట్టలు లేవు. సాయి పల్లవి విషయంలోనే ఎందుకు ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఆ ఫోటోలను డైరెక్టర్ రాజ్ కుమార్…సాయి పల్లవి పుట్టిన రోజున పోస్ట్ చేసారు. అంటే మే 9 న ట్వీట్స్ లో చేసిన ఫోటోలను ఇప్పుడు పెళ్లి ఫోటో అంటూ వైరల్ చేసారు. ఇంక ఈ రూమర్స్ కి అంతు లేదా.?

 

Previous article“సప్త సాగరాలు దాటి (సైడ్ A)” తో “రక్షిత్ శెట్టి” మరో హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్!!!
Next articleఅసలు కెనడాలో ఏం జరుగుతుంది.? ఎందుకు ఇండియన్స్ ని జాగ్రత్తగా ఉండమంటున్నారు..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.