“సప్త సాగరాలు దాటి (సైడ్ A)” తో “రక్షిత్ శెట్టి” మరో హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్!!!

Ads

కిరిక్ పార్టీ (Kirik Party), అతడే శ్రీమన్నారాయణ (Avane Srimannarayana), చార్లీ 777 (Charlie 777), గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) వంటి చిత్రాల‌తో పాన్ ఇండియా(Pan India) లెవల్ లో రక్షిత్ మంచి పేరు తెచ్చుకున్నారు. రక్షిత్ శెట్టి , రుక్మిణి జంటగా తాజాగా నటించిన చిత్రం ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ). ఈ నెల 1న రిలీజైన ఈ సినిమా కన్నడలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను “సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati (Side A)” అనే పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 22న విడుద‌ల చేసారు. ఆ సినిమా ఎలా ఉందో చూసేద్దాం రండి.

 • చిత్రం : సప్త సాగరాలు దాటి (సైడ్ A)
 • నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అచ్యుత కుమార్, శరత్ లోహితాశ్వ.
 • నిర్మాత : రక్షిత్ శెట్టి
 • దర్శకత్వం : హేమంత్ ఎం రావు
 • సంగీతం : చరణ్ రాజ్
 • విడుదల తేదీ : సెప్టెంబర్ 22, 2023

స్టోరీ :

మను (రక్షిత్ శెట్టి) ఒక కారు డ్రైవర్ …ప్రియ (రుక్మిణి వసంత్) సింగర్ కావాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మను, ప్రియ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. సొంత ఇల్లు కట్టుకొని ఇద్దరు సంతోషంగా ఉండాలి అంటూ ప్రియ కలలు కంటూ ఉంటుంది. శేఖర్ గౌడ (అవినాష్) అనే ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గర మను డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇంతలో మను యజమాని కొడుకు డ్రైవింగ్ కారణంగా ఒక వ్యక్తి చనిపోతాడు. దాంతో శేఖర్ గౌడ్, ఈ కేసుని మను మీద వేసుకోమని, కొద్ది రోజుల్లోనే విడిపిస్తాను అని దాంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇస్తాను అని మనుకి చెప్తాడు.

ప్రియ వద్దు అని చెప్పినా కూడా వినకుండా, ఇలా వచ్చే డబ్బులతో ప్రియతో కలిసి సంతోషంగా బతకచ్చు అని ఆలోచించి మను ఆ కేసుని తన మీద వేసుకొని జైలుకి వెళ్తాడు. కానీ అక్కడ మను అనుకోని సంఘటనలు ఎదుర్కొంటాడు. మనుకి బెయిల్ రాదు. శేఖర్ గౌడ గుండెపోటుతో చనిపోతాడు. అక్కడ జైలులో మను సోమ అనే ఒక వ్యక్తి గ్యాంగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు.

పిఎ ప్రభు (అచ్యుత కుమార్) ఈ కేసును పక్కదారి పట్టించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.మను బయటికి వచ్చాడా? మనుని బయటికి తీసుకురావడానికి ప్రియ ఎలాంటి పోరాటం చేసింది? ప్రియ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

Ads

రివ్యూ :

లవ్ స్టోరీస్ అంటే ఒక రకమైన టెంప్లేట్ ఉంటుంది అని ప్రేక్షకుల మెదడులో ఒక భావన ఏర్పడిపోయింది. కానీ ఈ సినిమా ఆ టెంప్లేట్ కి కాస్త భిన్నంగా ఉంటుంది. సినిమా మొత్తం ఒక ప్రశాంతమైన టోన్ లో సాగుతూనే, చాలా బలమైన ఎమోషన్స్ ని తెరపై చూపించింది. కెరీర్ గురించి కలలు కనే యువతి, నిజాయితీ ఉన్న ఒక యువకుడు, వారిద్దరూ ప్రేమలో పడడం. ఒకరితో ఒకరు జీవితాన్ని ఊహించుకోవడం. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది.

ఆ తర్వాత దర్శకుడు సినిమా ముందుకు తీసుకువెళ్లడానికి ఎంచుకున్న పాయింట్ మాత్రం సినిమా అయిపోయాక కూడా వెంటాడుతూ ఉంటుంది. సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సహజమైన బ్యాక్ డ్రాప్ లో సినిమా నడవడం. వారు మాట్లాడుకునే మాటలు, ప్రవర్తించే విధానం, వారు ఎదుర్కొనే సంఘటనలు ఇవన్నీ దర్శకుడు చాలా సహజంగా చూపించడానికి ప్రయత్నించాడు. అంతే కాకుండా, సినిమాలో చాలా వరకు జైలులో హీరో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని చూపించారు.

రక్షిత్ శెట్టి మను పాత్రలో చాలా బాగా నటించారు. అలాగే ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ రక్షిత్ శెట్టి తో సమానంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆమె పర్ఫార్మెన్స్ కి ఫిదా అవ్వాల్సిందే. అవినాష్, అచ్యుత కుమార్ వారి పాత్రలకి న్యాయం చేసారు. చరణ్ రాజ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా టోన్ ని పర్ఫెక్ట్ గా తెర మీద చూపించింది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సైడ్ బి లో ఏం జరగబోతోంది అనేది ఈ పార్ట్ లోనే చివరిలో చూపించారు.

ప్లస్ పాయింట్స్ :

 • హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్
 • లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
 • ఎమోషనల్ సీన్స్
 • సంగీతం
 • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

 • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సన్నివేశాలు.

రేటింగ్ : 3.25/5

watch trailer:

Previous articleటీం ఇండియా ప్లేయర్ కాదు, కోచ్ కాదు..మరి ఎవరు అతను.? ఆసియా కప్ అతని చేతుల్లో ఎందుకు పెట్టారు.?
Next article“సాయి పల్లవి” విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది.? ఇంక వీటికి అంతు లేదా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.