“మాస్” సినిమా ఎన్నో సార్లు చూసే ఉంటారు…కానీ ఈ సీన్ లో ఇది ఎప్పుడైనా గమనించారా.?

Ads

తెలుగు ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ ఒకరు. ఆయన మాస్ చిత్రాలకే కాకుండా, క్లాస్ చిత్రాలకు సైతం అద్భుతమైన మ్యూజిక్ ను అందించి ఆడియెన్స్ మెప్పు పొందాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు బాణీలు కట్టారు.

దేవీ శ్రీ ప్రసాద్ తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా తమిళ సినిమాలకు కూడా సంగీతాన్ని అందించారు. తాజాగా సోషల్ మీడియాలో దేవీ శ్రీ మ్యూజిక్ అందించిన సినిమాలలో రెండు సీన్స్ కు సేమ్ మ్యూజిక్ ఇచ్చారని పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేవీశ్రీ ప్రసాద్ టీనేజ్ లోనే ‘దేవి’ మూవీతో ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టాడు. 1999లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలోని పాటలు కూడా హిట్ అయ్యాయి. ఆ మూవీ తరువాత వరుస అవకాశాలు రావడంతో సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తూ, టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. సైమా అవార్డులలో భాగంగా తెలుగులో ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో అత్యధికంగా పదకొండు సార్లు నామినేట్ అయ్యారు.

7 సార్లు అవార్డును అందుకున్నాడు. ఇటీవల ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్‌లో పుష్ప మూవీకి గాను ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు, ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో దేవిశ్రీ సంగీతం అందించిన రెండు సినిమాలలో పాటలకు ఒకే మ్యూజిక్ అందించారని, వాటికి సంబంధించిన రెండు వీడియో క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేశారు.
నవ్వుతూ బ్రతకాలిరా, మాస్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమాలలోని రెండు సీన్స్ కు ఒకే మ్యూజిక్ ను ఇచ్చారని,ఎటర్నల్ సీన్స్ 187 అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఆ సీన్స్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.

Also Read: ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఈ సినిమా చూసారా.? ఎందులో ఉందంటే.?

Previous articleమరిదితో సరసాలాడటానికి…భర్తను వదిలించుకోవాలని “చేపల” కూరని చెప్పి “పాము” కూర పెట్టింది. చివరికి?
Next articleవరల్డ్ కప్ లో మన బాట్స్మన్ ఇతన్ని ఎదురుకోగలరా.? బాట్స్మన్ ని భయపెడుతున్న ఇతను ఎవరు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.