ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఈ సినిమా చూసారా.? ఎందులో ఉందంటే.?

Ads

గత కొద్ది కాలంగా మలయాళం సినిమాలు అన్ని తరహా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విభిన్నమైన కథనంతో పాటు.. వెరైటీ కాన్సెప్ట్లతో తెరకెక్కడంతో ఈ చిత్రాలకు తెలుగు మార్కెట్లో మంచి డిమాండ్ కలుగుతుంది. దీంతో మలయాళ దర్శక నిర్మాతలు మంచి టాక్ సంపాదించుకున్న తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ఓటీటీ లలో కూడా ఈ మూవీలకు మంచి గిరాకీ ఉంది.

దీంతో గతంలో రిలీజ్ అయి మంచి సూపర్ హిట్గా నిలిచిన పలు చిత్రాలను తెలుగులో డబ్ చేసి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ఇటీవల ఓటీటీలో వచ్చిన మలయాళం మూవీస్ 2018, నెయ్‌మార్‌, పద్మిని మాంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన మరొక మలయాళ సూపర్ హిట్ తెలుగు వర్షన్ మూవీ ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’. మలయాళం యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగు,తమిళ్‌, కన్నడ, హిందీ, బెంగాలీలో కూడా అవైలబుల్ గా ఉంది.

Ads

నేటితరం యువతకు.. వారి ఆలోచన శైలికి తగినట్టుగా ఉన్న ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు అరుణ్ డి. జోస్.ఈ మూవీ లో మలయాళ నటులు నస్లెన్ కె. గఫూర్, మాథ్యూ థామస్, మీనాక్షి దినేష్, నిఖిల విమల్, బిను పప్పు, రాజేష్ మాధవన్ తదితరులు నటించారు. కేరళలోని ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ కథలో టీనేజీ ప్రేమికులు తమ కుటుంబ విలువలను గౌరవిస్తూ తమ ప్రేమ ఎలా కొనసాగిస్తారు అనేది ఈ చిత్రం యొక్క మెయిన్ కాన్సెప్ట్. అత్యంత ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని మీరు కూడా చూడడం మర్చిపోకండి

watch video:

Previous articleకెనడా బహిష్కరించిన పవన్ కుమార్ రాయ్ ఎవరు..? అసలు కెనడాలో ఏమైంది.?
Next articleఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కాదు…వరల్డ్ కప్ లో ఈ టీం తో ఇండియాకి కష్టం అనుకుంటా.? ఎందుకంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.