Ads
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిల చదువు కోసం, వివాహం కోసం డబ్బు సేవ్ చేయాలని భావిస్తుంటారు. ఇందుకోసం మంచి పథకాల్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు.
Ads
అలా ఆడపిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేయాలనుకునే వారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. మరి ఈ పథకం ఏమిటో? దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. అమ్మయిల చదువు, వివాహ ఖర్చుల కోసం వారి తల్లిదండ్రులు ఆడపిల్లల చిన్న వయసు నుంచే సేవింగ్స్ చేసుకునే పథకం ఇది. ఈ పథకంలో నెల నెలా క్రమం తప్పకుండా స్థిరంమైన పెట్టుబడి పెట్టినట్లయితే పెద్ద మొత్తంలో అమ్మాయి కోసం డబ్బును సమకూర్చుకోవచ్చు. ఈ పథకం 21 ఏళ్ల పాటు మదుపు చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్కి పూర్తి అయ్యేవరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బును విత్డ్రా అయితే చేసుకోలేరు.
21 సంవత్సరాలు వచ్చిన తరువాత మిగిలిన మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి పథకంలో ప్రతి నెలా 12,500 రూపాయలు లేదా రోజుకు 416 రూపాయలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి రూ.1.5 లక్షలు అవుతాయి. ఈ డిపాజిట్ పై పూర్తి టాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చాక మొత్తం మనీ విత్డ్రా చేసినపుడు రూ.63,79,634 వస్తుంది. ఈ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ రూ.22,50,000, వడ్డీ రూ.41,29,634. నెల నెల స్థిరంగా రూ.12,500 డిపాజిట్ చేయడం వల్ల, ఆడపిల్ల భవిష్యత్తు కోసం 21 సంవత్సరాలకు ఒకేసారి రూ.64 లక్షలు పొందవచ్చు.