గ్యాస్ సిలిండర్ కదిలించకుండా… అందులో గ్యాస్ ఎంతవరకు ఉందో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!

Ads

ఒకప్పుడు వంట అంటే కట్టెల పొయ్యి మీద జరిగేది.. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ సర్వసాధారణం అయిపోయింది. అందుకే గ్యాస్ సిలిండర్ మన నిత్యవసరాల్లో ఒకటిగా మారింది. చాలావరకు మనం చేసే వంట పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే గబుక్కున అయిపోతుందేమో అన్న భయంతో చాలామంది రెండు సిలిండర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక సిలిండర్ పూర్తయ్యాక మార్చుకొని రెండవ సిలిండర్ బుక్ చేసుకుంటారు.

కొంతమంది తమ సిలిండర్ లో గ్యాస్ ఎంతవరకు ఉందో చూడడానికి చిన్న పరికరాలు లాంటివి కానీ అందరి దగ్గర ఇలాంటివి ఉండవు కదా మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటో అంటారా?..మీ సిలిండర్లో గ్యాస్ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి అనుకుంటే దాన్ని పైకెత్తి చూడాల్సిన అవసరం కానీ కదల్చవలసిన అవసరం కానీ అస్సలు లేదు. ఒక చిన్న చిట్కా ఫాలో అయితే సరిపోతుంది.. ఎటువంటి శ్రమ లేకుండా మీ సిలిండర్లో గ్యాస్ ఎక్కడ వరకు ఉందో ఇటే తెలిసిపోతుంది.

Ads

ఒక బౌల్లో వాటర్ , మంచి గుడ్డ ముక్కని తీసుకోవాలి ఆ తర్వాత ఈ బౌల్లో ఉన్న వాటర్ లోకి గుడ్డం నుంచి పిండాలి. ఇప్పుడు తడిగా ఉన్న గుడ్డను మీ గ్యాస్ సిలిండర్ పై ఉంచి తుడవండి. అయితే ఈ ప్రక్రియ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదటిది .. మీ కిచెన్ లో ఫ్యాన్ ఉన్నట్లయితే అది వెయ్యకపోవడం. ఒక నాలుగైదు నిమిషాల తర్వాత గమనిస్తే గ్యాస్ లేని భాగంలో నీటి తడి తొందరగా ఆరిపోతుంది .

సిలిండర్ లో గ్యాస్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం తడి చాలా నిదానంగా ఆరుతుంది.అంటే సిలిండర్ మీద తడి ఎంత ప్లేస్ వరకు ఉందో అక్కడి వరకు గ్యాస్ ఉంది అని అర్థం. చాలా చిన్న ట్రిక్ ఏ కదా ఇంతేనా అనిపిస్తోందా…అవును మరి వంటింటి చిట్కాలు అంటే ఇలాగే సులభంగా ఉంటాయి. మీరు కూడా ఈ ఐడియా ని తప్పక ఫాలో అవ్వండి.

Previous articleపెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగా ఉన్న.. 10 మంది ప్రముఖులు..!
Next articleపెళ్లిలో వధువుతో స్టాంప్ పేపర్ లపై సంతకం చేయించుకున్న వరుడి ఫ్రెండ్స్..! ఎందుకంటే..?