Ads
ఒకప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఆడాలి అంటే ఆ ప్లేయర్ కు అనుభవంతో పాటు అంతకుముందు ఆడిన మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శన కనబరిచి ఉండాలి. అయితే ప్రస్తుతం టీం సెలక్షన్ విధివిధానాలలో చాలా మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.సెప్టెంబర్ 28వ తేదీ వరకు ప్రపంచ కప్ జట్టులో ఐసీసీ అనుమతి లేకుండానే మార్పు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జరగబోయే ప్రపంచ కప్ చెట్లు టీం ఇండియా కూడా ఒక మార్పు చేయడం జరిగింది. అదే ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక ప్రపంచం వన్డే పోటీలు ప్రారంభం కావడానికి ఎన్నో రోజుల వ్యవధి లేదు. ఇంకొన్ని రోజుల్లో భారత్ వేదికగా వన్డే మహాసంగ్రామానికి సర్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతాయి. దీనికి నాందిగా ఇవాల్టి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇంత పెద్ద మెగా టోర్నమెంట్ కి ముందు ప్రపంచ కప్ జట్టులో చేసిన ఒక కీలకమైన మార్పు.. పెద్ద డిస్కషన్ కు తెరలేపింది.
ప్రపంచ కప్ జట్టు నుంచి అక్షర పటేల్ హ్యామ్ స్ట్రింగ్ ఇంజురీ కారణంతో వైదొలగడం జరిగింది. అతను కోలుకోవడానికి సుమారు మూడు వారాలపైనే సమయం పట్టవచ్చు కాబట్టి భారత్ సెలెక్టర్లు అతని ప్లేస్ లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఇక అశ్విన్ విషయానికి వస్తే అతను రివర్స్ క్యారమ్, ఆఫ్ స్పిన్ బంతులతో ప్రత్యర్థిని చిత్తు చేసే సామర్థ్యం కలిగిన బౌలర్.
Ads
అయితే ఇంత సడన్ గా వరల్డ్ కప్ రేస్ లోకి అతను ఎంట్రీ ఇవ్వడం చాలామందికి విచిత్రంగానే ఉంది. గత ఆరేళ్ల క్రికెట్ కెరీర్లో అశ్విన్ కేవలం 4 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు…మరి అలాంటిది సడన్గా ఇప్పుడు టీమ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరొక పక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వికెట్ తీయడంలో ముందు ఉండే అశ్విన్ టీమ్ లోకి రావడంతో బౌలింగ్ లైన్ అప్ స్ట్రాంగ్ అయింది అనేవాళ్ళు ఉన్నారు. ఎప్పటినుంచో వరల్డ్ కప్ ప్లానింగ్ లో అశ్విన్ కూడా ఒక భాగమే అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
బహుశా కెప్టెన్ కారణంగానే అక్షర్ పటేల్ గాయపడినప్పుడు వెంటనే అశ్విన్ను సర్ప్రైజ్ ఎంట్రీ గా తీసుకువచ్చారు అని కొందరు భావిస్తున్నారు. దీంతో అశ్విన్ కి రోహిత్ అండం ఎంతో లక్కీ అని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ అశ్విన్ సెలెక్ట్ అవ్వడంతో అతని ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భారత్ తొలి ప్రపంచ కప్ మ్యాచ్ అక్టోబర్ 8వ తారీఖున ఆస్ట్రేలియా తో జరగనుంది. మరి అశ్విన్ ఈ మ్యాచ్ లో తన ప్రదర్శనతో విమర్శకుల నోరు మూయిస్తాడా లేక సపోర్టర్స్ ను నిరాశ పరుస్తాడా తేలాల్సి ఉంది.
ప్రపంచకప్ ఇండియా టీం: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్