“చంద్రముఖి 2” లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? పుట్టింది కేరళ..చదివింది హైదరాబాద్.!

Ads

మహిమా నంబియార్…రాఘవ లారెన్స్, కంగనా కాంబినేషన్ లో వచ్చిన చంద్రముఖి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె పెద్దగా పరిచయం లేకపోయినా తమిళ్ ,మలయాళం ఇండస్ట్రీలో మంచి నేమ్ ఉంది. చంద్రముఖి 2 చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది మహిమా.

లారెన్స్ కు వీరాభిమాని అయిన మహిమ.. ఎప్పటినుంచో అతనితో నటించాలి అని కలలు కనేదట. అయితే ఇలా కలిసి నటించడమే కాకుండా స్టెప్పులు వేసే అవకాశం రావడం తో తెగ సంబరపడిపోతుంది. ఇక కంగనా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం… చంద్రముఖి 2 లాంటి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని తెలియపరిచింది.

Ads

డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న మహిమ…ఆ డాన్స్ ద్వారానే మోడలింగ్ లోకి ఇక ఆ తరువాత అక్కడ నుంచి 17 సంవత్సరాల వయసులోని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కేరళలో పుట్టి పెరిగిన మహిమా తన ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో పూర్తి చేసింది. 2010 లో కార్యస్థాన్ అనే మలయాళం మూవీ లో బాలనాటిగా నటించింది. చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యే సమయానికి తాను స్కూల్లో చదివేదట.

అప్పట్లో తల్లిదండ్రులతో కలిసి ఆ సినిమా బాగా ఎంజాయ్ చేసిన తాను ఇలా చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదట..అందుకే ఈ మూవీ లో ఆఫర్ తనకు జాక్పాట్ లాంటిది అని మహిమా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిమా ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.

Previous articleగత 6 ఏళ్లలో ఆడింది 4 వన్ డేలే.? వరల్డ్ కప్ కి ఎలా తీసుకున్నారు..రోహిత్ హస్తం ఉందా.?
Next article“నయనతార” కి ఉన్న ఈ ఆస్తుల వివరాలు తెలుసా.? హైదరాబాద్ లో ఏకంగా మూడు అపార్టుమెంట్స్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.