వరల్డ్ కప్ మ్యాచ్ లో ఈ ప్లేయర్ ఉంటేనే ఈ సారి టీం ఇండియా కప్ గెలుస్తుందా..? లేకపోతే కష్టమేనా..?

Ads

ప్రస్తుతం ప్రపంచంలో బలమైన క్రికెట్ టీమ్స్ లో ఇండియన్ టీం కూడా ఒకటి. అన్ని ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు గత కొద్ది కాలంగా తాడోపేడో తేల్చుకోవడానికి అయితే వెళ్తున్నాం కానీ కప్ మాత్రం చేతికి రావడం లేదు. 2013 ట్రోఫీ గెలిచిన తర్వాత మరొక ట్రోఫీ మన ఖాతాలోకి రాలేదు. ఇక ఐపీఎల్ మ్యాచ్ లలో అయితే ఫైనల్ సెమీఫైనల్ వరకే మన పయనం.. ఇక అక్కడి నుంచి లక్ కలిసి రావడం లేదు.

icc new rules for world cup

ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ 2023 మ్యాచెస్ కి వేదిక మన భారత్ కావడంతో మనకే దక్కాలి అన్న అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఈసారి టీం లో ఆ ఒక్క ప్లేయర్ ఉంటే చాలు…టైటిల్ కచ్చితంగా మన ఖాతాలోనే పడుతుంది అని నెటిజెన్లు ధీమాగా చెబుతున్నారు. ఈ సరికొత్త సెంటిమెంట్ మరెవరో కాదు టీమిండియా స్టార్ ప్లేయర్ శుభమన్ గిల్. అయితే ఈ మాట ఊరికే అనటం లేదు…అతనికి ఉన్న రికార్డ్స్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి.

Ads

ఎందుకంటే 2018లో అండర్ 19 ట్రోఫీని గెలిచిన టీం ఇండియా జట్టులో గిల్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత అతను ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ లో అడుగు పెట్టాడో లేదో…అయ్యర్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెల్చుకుంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ విషయానికి వస్తే…విన్ అయిన టీమ్ లో గిల్ ఉన్నాడు. కాబట్టి అతను ఉన్న టీం కి టైటిల్ కన్ఫామ్ అని ప్రస్తుతం కొందరు నటిజన్స్ సోషల్ మీడియాలో తెగ మీమ్స్ పెడుతున్నారు. ఇప్పటివరకు లక్కీ ప్లేయర్ అని ధోని కి ఉన్న ట్యాగ్ ప్రస్తుతం గిల్ కు వర్తించేలా ఉంది

Previous article“ఇద్దరమ్మాయిలతో” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇందులో హీరో తల్లిదండ్రులు చెప్పేది ఎవరి గురించి అంటే..?
Next articleఈ రాణిని పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని షరతులు పాటించాలా..? అవి ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.