ఈ రాణిని పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని షరతులు పాటించాలా..? అవి ఏంటంటే..?

Ads

చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలుగా పేరుగాంచిన వాటిలో మంగోల్ సామ్రాజ్యం కూడా ఒకటి. బుక్ ఆఫ్ వండర్స్ అనే పుస్తకంలో ఈ మంగోల్ సామ్రాజ్యం యొక్క రాకుమారి గురించి మార్కోపోలో ప్రస్తావించడం జరిగింది. అత్యంత సౌందర్యవతి కాదు అమితమైన బలవంతురాలు కూడా…ఆ రాజ్యం మొత్తంలో ఆమెతో పోటీపడి నిలబడగలిగే మగవారు కూడా లేరు అంటే ఆమె బలం ఎటువంటిదో ఆలోచించండి.

queen conditions for her love

ఆమెకు చాలా పేర్లు ఉన్నాయి… ఖుతులున్,అజియార్నే ఇలా.. చరిత్రలో ఎన్నో పేర్లు ఉన్నాయి. 13వ శతాబ్దిలో తూర్పు చైనా సముద్రం నుంచి హంగరీ సరిహద్దు ప్రాంతం వరకు విస్తరించి ఉన్న సామ్రాజ్యాన్ని మంగోల్ సామ్రాజ్యం అని పిలిచేవారు. ఈ సామ్రాజ్యాన్ని చెంఘిజ్ ఖాన్ వారసులు పరిపాలిస్తూ వచ్చారు.. చెంగిస్ ఖాన్ తర్వాత అతను వారసుడిగా ప్రకటించిన ఒగొడేయ్‌ని మంగోల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అతని మునిమడుగు రాలే ఈ ఖుతులున్.

queen conditions for her love

Ads

కుస్తీ పోటీలో అసమాన్యమైన ప్రతిభ కలిగిన ఈ అందగత్త పోటీలో తనని ఓడించే వ్యక్తి వచ్చే వరకు పెళ్లి చేసుకోను అని పట్టు పట్టి కూర్చుందట. కేవలం కుస్తీలోనే కాకుండా విలువిద్య ,గుర్రపు స్వారీ ఇలా ప్రతి యుద్ధ కలలో ఆరితేరిన ఆమెతో పోటీ అంటే ఎందరో భయపడి వెనుతిరిగారు. ఎందుకంటే పోటీలో ఆమె ఓడిపోతే పెళ్లి చేసుకుంటుంది అవతల వ్యక్తి ఓడిపోతే 100 గుర్రాలు సమర్పించుకోవాలి. అప్పటికే ఎంతోమంది ప్రయత్నించి విఫలం అవ్వడంతో ఖుతులున్ దగ్గర 10,000 గుర్రాలు ఉండేవని తన పుస్తకంలో మార్కోపోలు రాశారు.

queen conditions for her love

వినే వాళ్ళకి ఇది కల్పిత కథలా ఉన్నప్పటికీ ఇది తీసుకుంది ఏ పుక్కిటి పురాణం నుంచో కాదు ప్రపంచంలో ఎన్నో చరిత్రలకు ఆధారంగా నిలిచిన మార్కోపోలో పుస్తకం నుంచి. మార్కోపోలో తో పాటుగా 14వ శతాబ్దం నాటి రషీద్-ల్-దిన్ హమ్దానీ కూడా తన పుస్తకం ‘జమీ అల్-తవారిజ్’లో ఈ మంగోల్ వీర వనిత గురించి రాయడం జరిగింది.

Previous articleవరల్డ్ కప్ మ్యాచ్ లో ఈ ప్లేయర్ ఉంటేనే ఈ సారి టీం ఇండియా కప్ గెలుస్తుందా..? లేకపోతే కష్టమేనా..?
Next articleఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు..? అసలు స్టోరీ ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.