Ads
ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వివాహం అనేది ఎంతో ముఖ్యమైనది. వివాహం తర్వాత జీవితం లో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పైగా పెళ్లి ప్రతి ఒక్క జంటకి కూడా చాలా ప్రత్యేకమైనది. పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు.
జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ముఖ్యమైన క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ.. కలలు కంటూ ఉంటారు.
అయితే పెళ్లి తర్వాత ఆ కలలు నిజమవ్వచు నిజం అవ్వకపోవచ్చు. కొంతమంది భార్య భర్తలు ఎంతో ఆనందంగా కలిసి జీవిస్తూ ఉంటే కొంతమంది భార్యాభర్తలు ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. కానీ పెళ్లి తర్వాత భార్యాభర్త ఒకరికి నచ్చినట్లుగా ఒకరు సర్దుకుంటూ ఉండాలి. కానీ చాలామంది స్త్రీలు అంటూ ఉంటారు పెళ్లికి ముందు చాలా భిన్నంగా ఉండేవారు మా ఆయన కానీ పెళ్లి తర్వాత చాలా మార్పు వచ్చిందని చెప్తారు. మరి భర్తల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయి..? దానిని భార్యలు ఎలా అర్ధం చేసుకోవాలి అనేది ఇప్పడు చూద్దాం.
#1. సమయం వలన:
Ads
పెళ్లికి ముందు ఎక్కువ సమయాన్ని కేటాయించొచ్చు కానీ పెళ్లి తర్వాత బాధ్యత వలన అంత సమయం దొరక్కపోవచ్చు. అయితే మహిళలూ ప్రేమ అలానే ఉందని అర్థం చేసుకోవాలి. మీ భర్త కి సమయం దొరకడం లేదని అర్థం చేసుకోవాలి.
#2. కొత్త గుణాలు:
ఎవరైనా సరే మంచిగా ఉండాలని మంచి గుణాలని మాత్రమే చూపాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి పెళ్లికి ముందు స్వీట్ గా అనిపిస్తూ ఉంటుంది కానీ పెళ్లయిన తర్వాత ఇద్దరు కలిసి జీవించడం మొదలుపెడతారు. అన్ని విషయాలు బయటపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా భార్యలు అర్థం చేసుకోవాలి.
#3. లోపాల్ని కూడా స్వీకరించండి:
ఒక్కొక్కసారి మనం అనుకున్నంత ఈజీగా లైఫ్ వెళ్ళదు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కానీ నిజానికి ప్రతి ఒక్క దానిని కూడా పొడిచి చూడకండి. వారి లోపాల్ని కూడా మీరు స్వీకరించండి. అప్పుడు కచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు. అయితే మహిళల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి ఇలా మార్పులు రావడం సహజమే. మార్పులు వచ్చాయని ద్వేషించడం మొదలు పెట్టకూడదు. అదే ప్రేమని కొనసాగించాలి. చిన్న చిన్న వాటికి సర్దుకోవాలి.